టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్యా ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే అర దశాబ్దం పాటు ఎన్నో కష్టాలు పడి నటుడు కావాలనే తన కోరికను నెరవేర్చుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరులో జన్మించిన విజయవాడలో చదువు పూర్తి చేసి తదనంతరం యాక్టర్ అవ్వాలన్న కోరికతో హైదరాబాద్ నగరానికి మకాం మార్చాడు. మన పరిశ్రమలో అరంగేట్రం చేయకముందు నాగశౌర్య టెన్నిస్ ఆట ఆడే వాడు. వెండి తెరపై కనిపించే ముందు నాగశౌర్య దాదాపు ఐదు సంవత్సరాలు కష్టపడ్డాడట. ప్రతిసారీ ఎంపికవ్వడం సినిమాలో నటించేందుకు సంతకం పెట్టేందుకు సిద్ధమవడం ఆ తర్వాత ఏదో ఒకటి జరిగితే తన ఛాన్స్ చేజారిపోవడం అతని జీవితంలో ఎన్నోసార్లు జరిగాయట.


దీంతో సినిమా పరిశ్రమ పై విరక్తి పుట్టిన నాగ శౌర్య కి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి పోవాలనిపించిందట. ఆ సమయంలోనే ఊహలు గుసగుసలాడే చిత్రంలో నటించేందుకు నటీనటులు కావలెను అని వారహి చలానా చిత్రమ్ ప్రచురించిన ఒక ప్రకటన చూశాడట. ఎలాగో ఇంటికి వెళ్ళిపోతున్నాను కదా అని చివరిసారిగా ప్రయత్నం చేద్దామన్నా ఉద్దేశ్యంతో తాను తనకు సంబంధించిన సమాచారాన్ని వెబ్సైట్లో పొందుపరిచాడు. అయితే ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న శ్రీనివాస అవసరాల నాగ శౌర్య కి హీరోగా అవకాశం ఇచ్చాడు. శుభ వార్త విన్న నాగశౌర్య ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఎందుకంటే ఈ సినిమాలో కూడా తనకు చాన్స్ దక్కదని అనుకున్నాడు కానీ ఈసారి మాత్రం అలా జరగలేదు. రొమాంటిక్ కామిడీ సినిమాలో నటిస్తున్న సమయంలో అతనికి చందమామ కథలు సినిమాలో మరొక ఛాన్స్ వచ్చింది.



దీంతో ఆ సినిమా చేసేందుకు కూడా నాగశౌర్య అంగీకరించాడు. అలా రెండు సినిమాలతో బిజీ అయిపోయిన నాగశౌర్య తెగ సంతోష పడి పోయే వాడట. మొట్టమొదటిగా అతను నటించిన చందమామ కథలు విడుదలయ్యి యావరేజ్ టాక్ ను సంపాదించుకుంది. రెండు నెలల తర్వాత ఊహలు గుసగుసలాడే సినిమా విడుదలై భారీ హిట్ గా నిలిచింది. మల్టీప్లెక్స్ ప్రేక్షకులు,  విమర్శకులు, మాస్ ఆడియన్స్ కూడా ఈ సినిమాని ఎంతగానో ఆదరించారు. ఈ ఒక్క సినిమాతోనే నాగశౌర్య క్రేజ్ అమాంతం పెరిగిపోయింది అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రాశి ఖన్నా కి కూడా మంచి పేరు వచ్చింది. కొత్త నటీనటులు అయినప్పటికీ వీళ్లిద్దరూ చాలా బాగా నటించి అందరి ప్రశంసలు పొందారు. తన సినీ కెరీర్లో ఛలో, ఓ బేబీ, జో అచ్యుతానంద వంటి
సూపర్ హిట్ చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి పోతున్నాడు నాగ శౌర్య.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: