పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి సినిమా ఎంతగా డిజాస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. అయితే ఈ చిత్రం డిజాస్టర్ కావడంతో పాటు ఈ చిత్రం మరొక సినిమా నుంచి కాపీ కొట్టినట్టు విమర్శలు వెల్లువెత్తడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ పై అభిమానులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో ఎంతో క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ కోసం ఎవరో తీసిన సినిమాని ప్రజలపై రుద్ది చేతుల దులుపుకున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. డిజాస్టర్ సినిమా ని పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రేక్షకుల కోసమేనా ఒక మంచి హిట్ అతడి ఖాతాలో వేసే బాధ్యత అతనిపై ఎంతైనా ఉంటుంది. కానీ మొన్నీమధ్య త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం పవన్ కళ్యాణ్ తో సినిమా తీసేందుకు ఆసక్తి చూపడం లేదని అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


అతడు ఎక్కడ కనిపించినా పవన్ కళ్యాణ్ అభిమానులు వెంటనే  పవర్ స్టార్ తో ఎప్పుడు సినిమా తీస్తున్నారని ప్రశ్నలతో ముంచెత్తుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ తో సినిమా తీస్తానని త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పకుండా తిరుగుతున్నాడు. దీంతో మెగా అభిమానుల్లో తనపై బాగా కోపం పెరిగిపోతుంది. వారిని శాంత పరచాలంటే పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏదో ఒక సినిమా తీయాలి కానీ పవన్ కళ్యాణ్ ఇప్పటికే మూడు సినిమాల్లో నటించేందుకు అంగీకరించాడు. అలాగే రెండు సినిమాలను పెండింగ్ లో పెట్టాడు. మొత్తం కలిపి అయిదు సినిమాలు పూర్తవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో సరిగ్గా చెప్పలేని పరిస్థితి. అప్పటిదాకా త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఏ సినిమా రాకపోతే మెగా అభిమానుల్లో అసహనం ఎక్కువ అవుతుందని త్రివిక్రమ్ శ్రీనివాస్ భావించి పవన్ కళ్యాణ్ తో ఏదో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు.



ఈ క్రమంలోనే తాను తీసుకున్న ఒక నిర్ణయం ప్రస్తుతం అభిమానుల్లో కాస్త అసహనాన్ని తగ్గించిందని చెప్పుకోవచ్చు. అదేంటంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ స్టార్ ప్రొడక్షన్ ఉపయోగించుకొని రామ్ చరణ్ తో ఒక సినిమా తీయాలని నిర్ణయించుకున్నాడు. ఈ విధంగా చేస్తే అభిమానుల్లో కాస్తయినా అసహనం తగ్గుతుందని త్రివిక్రమ్ శ్రీనివాస్ భావిస్తున్నాడు. అలాగే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ కోసం ఒక మంచి కథ రాసి సూపర్ డూపర్ హిట్ ఇవ్వాలని బలంగా నిశ్చయించుకున్నాడు. ఏదేమైనా త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ అభిమానుల్లో కాస్త నిరాశనే మిగిల్చాడని చెప్పుకోవచ్చు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: