తెలుగు చిత్ర పరిశ్రమలో కొద్దీ కాలంలోనే  స్టార్ హీరో గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న హీరో లవర్ బాయ్ ఉదయ కిరణ్.  చిత్రం సినిమాతో కెరియర్ ను మొదలు పెట్టిన అతను మొదట్లో చేసిన సినిమాలు అవి సాధించిన విజయాలు అన్నీ కూడా అతనిని  ఒక స్టార్ ని చేసాయి. ఏ హీరో కూడా హ్యాట్రిక్ హిట్స్ ఆ టైం లో కొట్టలేదు అనే చెప్పాలి. తన నటన తో వరుస చిత్రాలలో నటించి స్టార్ హీరోలకు పోటీగా నిలిచాడు. ఆ సినిమాలు సాధించిన విజయం తర్వాత అతనికి చాలా మంచి ఆఫర్లు వచ్చాయి. 

 

 

తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖ దర్శక నిర్మాతలు అతని తో సినిమాలు చేయడానికి గానూ ముందుకు వచ్చారు. స్టార్ హీరోల సినిమాల్లో కూడా లేని విధంగా అతని సినిమాల్లో ఉన్న  కథలు వాటికి అతను ఇచ్చిన ప్రాధాన్యత అన్నీ కూడా చాలా బాగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అతని నటన కూడా చాలా బాగా ప్రేక్షకులకు నచ్చింది అనే చెప్పాలి. ఏ స్టార్ హీరో కూడా చేయలేని విధంగా యూత్ ని ఆకట్టుకునే విధంగా అతను కథలను ఎంపిక చేసుకున్నాడు అనే చెప్పాలి.

 

 

అగ్ర హీరోగా స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత అతను చేసిన తప్పులు అతనిని బాగా ఇబ్బంది పెట్టాయి అనేది వాస్తవం. అప్పటికి ఇప్పటికి అతను అమ్మాయిలకు లవర్ బాయ్ గా గుర్తున్నాడంటే విశేషమని చెప్పాలి. అతని ఆత్మహత్య చాలా మందిని బాధ పెట్టిన విషయం. అతను ఎందుకు చేసుకున్నాడు అనేది స్పష్టంగా తెలియదు గాని అతను మాత్రం కెరీర్ లో చాలా ఇబ్బందులు పడ్డాడు. వచ్చిన ఇమేజ్ ని అసలు కాపాడుకోలేదు. అతని జీవితం ఇలా మొగ్గలోనే అంతమవ్వడం అందరిని బాధ పెట్టింది. ఏ లోకాన ఉన్న ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. 

మరింత సమాచారం తెలుసుకోండి: