పవన్ సినిమా అనగానే ఫాన్స్ కి ఒక రేంజ్ లో పండగ. సినిమా ఎప్పుడు వస్తుందా అని ముందు నుంచి కూడా ఎదురు చూస్తూ ఉంటారు. సినిమా సినిమాకు పవన్ క్రేజ్ పెరుగుతుందే గాని తగ్గే అవకాశం మాత్రం ఉండటం లేదు. అతని సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా సరే అదే రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. అతని సినిమాలు వరుసగా నాలుగు ఫ్లాప్ అయినా సరే ఫాన్స్ లో మాత్రం అదే జోష్ ఉంటుంది అనే సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన వకీల్ సాబ్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది. 

 

ఈ సినిమాను వాస్తవానికి ఈ ఏడాది మార్చ్ లో విడుదల చెయ్యాలి అని చూసారు. ఆ తర్వాత మే లో విడుదల చెయ్యాలి అని చూసారు గాని అది సాధ్యం అయ్యే విధంగా అలేదు అని  మళ్ళీ వాయిదా వేస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతి అంటున్నారు.ఇటీవల ఈ సినిమాను దసరా కు విడుదల చేసే అవకాశం ఉంది అని కూడా అన్నారు గాని అతను మాత్రం అంతగా ఆసక్తి చూపించడం లేదు అని తెలుస్తుంది. అందుకే సినిమాను వాయిదా వేసారు అని ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో జరుగుతుంది. 

 

ఇప్పుడు కరోనా దెబ్బకు పవన్ కాస్త వెనకడుగు వేస్తున్నారు అని సినిమా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ సినిమాను ఆలస్యం చేయడానికి చాలానే కారణాలు ఉన్నాయి అని అంటున్నారు. వకీల్ సాబ్ ని వచ్చే ఏడాది  సంక్రాంతికి విడుదల చేయడానికి గానూ ఈ ఏడాది ఆగస్ట్ నుంచి షూట్ అనుకున్నా సరే కాదు అని మళ్ళీ సెప్టెంబర్ కి మార్చారు అని అంటున్నారు. చూడాలి మరి ఎప్పుడో...

మరింత సమాచారం తెలుసుకోండి: