కరోనా మహమ్మారితో ప్రపంచంలోని ప్రజలు అల్లకల్లోలం అవుతున్నారు. చైనాలోని పుహాన్ లో పుట్టుకు వచ్చిన ఈ మాయదారి కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తం చుట్టేసింది. ప్రాణ, ఆర్థిక నష్టాలను కలగజేస్తుంది. ప్రపంచంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. ఆదివారం ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా 2,12,000 కొత్త కేసులు నమోదవగా,  3586 మంది మరణించారు. ఈ కొత్త కేసుల్లో 60 శాతం అమెరికా, బ్రెజిల్‌ దేశాల్లోనే నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. ఇక కరోనాకి సామాన్యుడు లేడు సెలబ్రెటీ లేడు ఎవ్వరినీ వదలడం లేదు. ఇటీవల కాలంలో సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులు కూడా కరోనా భారిన పడి చనిపోయారు.

IHG

తాజాగా హాలీవుడ్‌లో కరోనా మరో తీవ్ర విషాదాన్ని నింపింది.  ప్రముఖ నటుడు నిక్ కార్డెరో(41) కన్నుమూసినట్లు తెలుస్తుంది.  గత 90 రోజులుగా కరోనా వ్యాధితో పోరాడుతున్న ఆయన చివరకు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఇటీవల అనారోగ్యం తో బాధపడుతున్న నిక్ ను లాస్ ఏంజిల్స్ లోని సెడార్స్ సినాయ్ మెడికల్ సెంటర్ లో చికిత్స పొందుతున్నారు. అదే సమయంలో అతని కుడికాలిలో ర‌క్తం గ‌డ్డం క‌ట్ట‌డంతో  దాన్ని కూడా తొలగించారు. ఓ వైపు చికిత్స పొందుతూనే పరిస్థితి విషమించి చనిపోయాడు. 

IHG

2014 బ్రాడ్‌వే మ్యూజికల్ బుల్లెట్స్ ఓవర్ బ్రాడ్‌వేలో నటించినందుకు సంగీతంలో ఉత్తమ నటుడిగా టోనీ అవార్డుకు ఎంపికయ్యారు. రెండుసార్లు డ్రామా డెస్క్ అవార్డులకు కూడా ఎంపికయ్యాడు. ఇక  రాక్ ఆఫ్ ఏజెస్‌, వెయిట్ర‌స్‌, ఎ బ్రాంక్స్ టేల్ వంటి ప‌లు చిత్రాల్లోనూ న‌టించారు. బుల్లితెర‌పై వ‌చ్చే బ్లూ బ్ల‌డ్స్, లా అండ్ ఆర్డ‌ర్‌ సిరీస్‌లోనూ క‌నిపించారు. అతని మరణంపై హాలీవుడ్ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.  నిక్ కార్డెరో మరణం గురించి ఆయన భార్య సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: