కరోనా వైరస్ రాకతో దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన సినిమా ఇండస్ట్రీ దాదాపు ఇటీవల మూడు నెలలకు పైగా క్లోజ్ అయిపోయింది. సినిమా షూటింగ్ మొత్తం ఆగిపోయే సినిమా థియేటర్లు కూడా మూతపడడం జరిగాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా షూటింగ్ లకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని సినిమా ధియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయి అన్న దాని విషయంలో సరైన స్పష్టత లేదు. దీంతో సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయి రిలీజ్ కావాల్సిన సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ అవటానికి రెడీగా ఉన్నాయి. ఇదిలా ఉండగా సినిమా థియేటర్లు ఇప్పుడప్పుడే ఓపెన్ అయ్యే పరిస్థితి లేదని వార్తలు వస్తున్నాయి.

IHG

కాగా కరోన రాకముందు యాంకర్ ప్రదీప్ నటించిన  '30 రోజుల్లో ప్రేమించడం ఎలా'...సినిమా హడావిడి చాలా పెరిగింది. బుల్లితెరపై స్టార్ యాంకర్ గా రాణించిన ప్రదీప్ నటించిన మొదటి సినిమా కావడంతో మొదటిలో బీభత్సమైన హడావిడి సోషల్ మీడియాలో జరిగింది. అంతే కాకుండా సినిమా లో ‘నీలి నీలి ఆకాశం’ అనే సాంగ్ చాలామంది ప్రేక్షకులను అలరించడం తో పాటుగా సోషల్ మీడియాలో అనేక రికార్డులను సృష్టించడం జరిగింది.

IHG

సినిమాకి ప్రమోషన్ జరగక ముందే ఈ సాంగ్ తో మంచి హైప్ వచ్చింది. అటువంటిది కరోనా వైరస్ తర్వాత లాక్ డౌన్ వలన ఈ సినిమా ఊసే ఎవరు ఎత్తటం లేదు. చాలా వరకు క్రేజీ కాంబినేషన్ సినిమాల గురించి జనాలు పెద్దగా ప్రస్తుతం పట్టించుకోకపోవడంతో ఆ సినిమా నిర్మాతలు సినిమాకి ఉండే క్రేజ్ తగ్గిపోతుందే మోనని భయం గా ఉన్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. మొత్తంమీద కరోనా తర్వాత జనాలలో సినిమాల మీద చాలావరకు ఇంట్రెస్ట్ పోయినట్లు అర్థమవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: