ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురములో సినిమాతో సూపర్ హిట్ కొట్టి మళ్ళి కెరీర్ పరంగా ఫామ్ లోకి వచ్చిన యువ నటుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ప్రస్తుతం నటిస్తున్న సినిమా పుష్ప. వెరైటీ సినిమాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో మంచి యాక్షన్ ప్యాక్డ్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసుకుంది. లాక్ డౌన్ కి ముందు శేషాచలం అడవుల్లో ఈ సినిమాకు సంబంధించి రెండు కీలక షెడ్యూల్స్ జరిగాయి. 

IHG's First Celeb <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=PRESS' target='_blank' title='press-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>press</a> Conference Post Lockdown Slammed

అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అల్లు అర్జున్ పుష్పరాజ్ అనే మాస్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా గంధపు చెక్కల నేపథ్యంలో తెరకెక్కుతోంది. తమిళ నటుడు విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలోని ప్రత్యేకమైన ఐటెం సాంగ్ కోసం ఇటీవల పలువురు హీరోయిన్లను పరిశీలించిన దర్శకుడు సుకుమార్, ఎట్టకేలకు బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా ను ఎంచుకున్నట్లు టాక్. భాగ్ జానీ, కాబిల్, పోరోబాషినే తదితర సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో నర్తించి మంచి పేరు గడించిన ఊర్వశి అయితేనే తమ సినిమాలోని ఐటెం సాంగ్ కి కరెక్ట్ అని భావించిన సుకుమార్, ఇటీవల ఆమెను సంప్రదించడం, అలానే ఆమె కూడా ఆ సాంగ్ చేయడానికి ఒప్పుకోవడం జరిగిందని లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. 

 

నిజానికి సుకుమార్ సినిమాగా అనగానే ఐటెం సాంగ్ తప్పనిసరిగా ఉంటుంది, ఇటీవల రామ్ చరణ్ తో సుకుమార్ తీసిన రంగస్థలం సినిమాలో జిగేలు రాణి ఐటెం సాంగ్ సూపర్ హిట్ అవడంతో పాటు ఆ సాంగ్ లో హీరోయిన్ పూజ హెగ్డే ఆడి పాడి అదరగొట్టింది. కాగా పుష్ప సినిమాలోని ఐటెం సాంగ్ ఎలా ఉంటుందో అది ఎంత మేర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త పై పుష్ప యూనిట్ నుండి అధికారిక సమాచారం మాత్రం వెలువడాల్సి ఉంది.....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: