మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఎనిమిది మంది హీరోలున్న విషయం తెలిసిందే. చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ కూడా చిరంజీవి అడుగుజాడల్లో హీరో అయ్యాడు. ఇప్పటికే విజేత సినిమాతో తెరంగేట్రం కూడా చేశాడు. తన రెండో ప్రాజెక్ట్ గా ‘సూపర్ మచ్చి’ సినిమా చేస్తున్నాడు. హీరోయిన్ గా రుచితా రామ్ నటిస్తోంది. ఇటివల లాక్ డౌన్ ఆంక్షల తర్వాత షూటింగ్ జరుపుకున్న అతికొద్ది సినిమాల్లో సూపర్ మచ్చి కూడా ఒకటి. ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో రుచితా రామ్ ఫస్ట్ ఆప్షన్ కాదని అంటున్నాడు.

IHG

 

బాలీవుడ్ లో ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని హీరోయిన్ గా తీసుకున్నాం. కొంతభాగం షూటింగ్ పూర్తయ్యాక తనకు సుశాంత్ తో సినిమా ఉందంటూ వెళ్లిపోయింది. దీంతో రుచితా రామ్ ను హీరోయిన్ గా తీసుకున్నాం.. అని చెప్పుకొచ్చాడు. రియాపై తీసిన సీన్లను మళ్లీ రుచితాతో రీషూట్ చేయాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చాడు. సుశాంత్ ఆత్మహత్య అనంతరం పోలీసుల విచారణకు కూడా రియా హాజరైన విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాకు సంబంధించి ఒక పాట కొంత భాగం షూటింగ్ మిగిలి ఉందని చెప్పుకొచ్చాడు.

IHG

 

లాక్ డౌన్ సడలింపుల తర్వాత షూటింగ్ చేయాలని మావయ్య చిరంజీవిని సంప్రదిస్తే తగిన జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ కు వెళ్లాలని చెప్పారట. ‘సినిమాలో రఫ్ గయ్ గా నటిస్తున్నా సాఫ్ట్ నేచర్ ఉన్న పాత్రలో నటిస్తున్నా. బార్ లో సింగర్ గా నటిస్తున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో షూటింగ్ చేయడం వల్ల ఇంట్లో సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నాను. నా కూతురు పుట్టినరోజు వేడుకలు ఇంట్లోనే జరిగినా వెళ్లలేని పరిస్థతి’ అని తాను ఎదుర్కొన్న పరిస్థితులను వివరించాడు కల్యాణ్ దేవ్.

IHG' Vijetha ' First Look | <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CHIRANJEEVI' target='_blank' title='chiranjeevi-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>chiranjeevi</a> | IHG...

మరింత సమాచారం తెలుసుకోండి: