టాలీవుడ్ లో హీరోయిన్ లకు కాస్త కష్టంగానే ఉంది అనే వార్తలు వస్తున్నాయి. దానికి కారణం ఏంటీ అనేది తెలియదు గాని హీరోయిన్ ల విషయంలో గతంలో ఉన్న మాదిరిగా వాతావరణం అయితే ఉండే అవకాశం లేదు అని చాలా మంది అంటున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో చేసే హీరోయిన్ లకు చాలా కష్టంగా పరిస్థితి ఉండే అవకాశాలు ఉన్నాయి. స్టార్ హీరోల సినిమాల్లో గతంలో చేసే వారికి భారీగా బడ్జెట్ ని ఇచ్చే పరిస్థితి మనం చూసాం. కాని ఇప్పుడు అంత సీన్ మాత్రం లేదు అనే చెప్పాలి. దానికి కారణం సినిమాల్లో వసూళ్లు వచ్చే అవకాశాలు లేకపోవడమే. 

 

అందుకే స్టార్ హీరోయిన్ లు చాలా మంది ఇప్పుడు వేరే భాషల వైపు చూస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. పూజ హెగ్డే తెలుగు మీద దృష్టి పెట్టడం లేదు అని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. మరి కారణం ఏంటీ అనేది స్పష్టంగా తెలియదు గాని ఆమె అసలు తెలుగు లో ఒక్క సినిమా కూడా ఇప్పుడు ఓకే చేయడానికి రెడీ గా లేదు అని  టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇటీవల దిల్ రాజు ఆమెను ఒక సినిమా విషయంలో కాస్త ఇబ్బంది పెట్టారు అని అంటున్నారు. ఇబ్బంది అంటే ఏమీ లేదు తాను గతంలో ఇచ్చే విధంగా ఇవ్వలేను అని చెప్పారు అని అంటున్నారు. 

 

అందుకే చాలా వరకు ఆమె తెలుగు లో వద్దు బాలీవుడ్ లోనే చేద్దాం అనే భావన లోనే ఉంది అని అక్కడ రణబీర్ కపూర్ తో ఒక సినిమాకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆమె అక్కడే ఎక్కువగా సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు మరి. నిజమా కాదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: