దేశంలో మార్చి నెల నుంచి కరోనా కేసులను కట్టడి చేయడానికి లాక్ డౌన్ ప్రకటించింది కేంద్రం.  అప్పటి నుంచి రవాాణా, విద్యా, మద్యం వ్యవస్థలతో పాటు ఎంట్రటైన్ మెంట్ కి సంబంధించిన అన్ని క్లోజ్ చేశారు. అప్పటి నుంచి వెండితెర, బుల్లితెర షట్ డౌన్ కావడంతో ఎంతో మంది దీన్ని నమ్ముకున్నవారు కష్టాల్లో పడ్డారు. ముఖ్యంగా సినీ కార్మికులు పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సీ.సీ.సీ. స్థాపించి వెండితె, బుల్లితెర కార్మికుల కోసం విరాళాలు సేకరించి వారికి సహాయం చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ సడలించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్,  సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి సినీ పెద్దలు కలిసి షూటింగ్స్ కి పరిమిషన్ ఇవ్వాలని కోరారు.

 

దానికి తెలంగాణ సర్కార్ పరిమిషన్ కూడా ఇచ్చింది. తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ ను తెలుగు బుల్లితెర నిర్మాతల కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న 2 వేల మంది టీవీ కళాకారులు, కార్మికులకు తలసాని నిత్యావసరాలు పంపిణీ చేసి ఆదుకున్నారు. ఈ నేపథ్యంలో, టీవీ ప్రొడ్యూసర్స్ కమిటీ అధ్యక్షుడు ప్రసాద్, సభ్యులు ప్రభాకర్, వినోద్ బాల, కిరణ్, అశోక్, డీవై చౌదరి, వెంకటేశ్వరరావు తదితరులు సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్ పల్లిలోని మంత్రి తలసాని నివాసానికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. 

 

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నివారణ సాధ్యమేనని తెలిపారు. షూటింగుల నేపథ్యంలో భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: