గతంలో ఒక సినిమా వస్తుంది అంటే చాలు ఉండే హడావుడి అంతా ఇంతా కాదు. సినిమాల విషయాలో ఫాన్స్ లో ఒక జోష్ అనేది ఉండేది. అందుకే స్టార్ హీరోలు కూడా  తమ సినిమాల మార్కెటింగ్ కి ఫస్ట్ లుక్ తో పాటుగా ట్రైలర్ టీజర్ ని బాగా వాడుకునే ప్రయత్నం చేసే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా కనపడటం లేదు. ఫాన్స్ హడావుడి చేసే వాతావరణం లేదని అంటున్నారు. కరోనా దెబ్బకు చాలా వరకు ఇప్పుడు ఫాన్స్ కూడా సినిమాల విషయంలో జోష్ చూపించడం లేదు అని మొదటి రోజు సినిమా చూసే ఫాన్స్ బాగా తగ్గే అవకాశం ఉంది అని అంటున్నారు. 

 

మరి దానికి కారణం ఆర్ధిక ఇబ్బందులా లేక సినిమాల మీద ఆసక్తి తగ్గదమా అనేది తెలియాలి. స్టార్ హీరోల సినిమా విషయంలో గతంలో ఒక రేంజ్ లో క్రేజ్ అనేది ఉండేది. కాని ఇప్పుడు సినిమా వార్తలు అన్నీ కూడా సోషల్ మీడియాలో రావడం వాటిని అందులోనే పోస్ట్ చేయడం వాటివి మనం చూస్తున్నాం. చాలా వరకు అగ్ర హీరోలు అందరూ కూడా ఇప్పుడు వసూళ్ళ పరంగా బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంది అని సమాచారం. ఇక అందుకే భారీ బడ్జెట్ సినిమాలను కూడా వద్దు అనుకునే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ లో అంటున్నారు మరి. 

 

అగ్ర హీరోల సినిమాల విషయంలో చాలా వరకు గతంలో ఉండే పరిస్థితి అయితే ఉండదు అని అంటున్నారు. అగ్ర హీరోల సినిమాల విషయంలో గత పరిస్థితికి భిన్నంగా వాతావరణం ఉండటం తో సినిమాలు కొనే వారు కూడా ముందుకు రావడం లేదు అని  కొందరు అంటున్నారు. అసలు ఎం జరుగుతుంది ఏంటీ అనేది చూడాలి మరి. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలు ఏవీ విడుదలకు లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి: