టాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల విషయంలో అనేక అనుమానాలు ఉన్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలు అసలు ఏ విధంగా సినిమాలు చేస్తున్నారు వారు ఎంచుకునే కథల విషయంలో ఇప్పుడు ఏ విధంగా అడుగులు వేస్తున్నారు ఇలాంటి చాలా విషయాలు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గానే ఉన్నాయి. అగ్ర హీరోల విషయంలో దర్శక నిర్మాతలు కూడా చాలా వరకు జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నారు అనే చెప్పాలి. స్టార్ హీరోల సినిమాలు అనగానే గతంలో మాదిరిగా భారీగా పెట్టుబడి పెట్టే వాతావరణం అయితే లేదు అనే చెప్పాలి. 

 

దానికి కారణం సినిమాలో పెట్టిన పెట్టుబడి అసలు వస్తుందా లేదా అనే అనుమానాలు ఉండటమే. టాలీవుడ్ లో ఇప్పుడు చాలా వరకు అగ్ర నిర్మాతలు సినిమాల మీద అంతగా ఫోకస్ చేయడం లేదు అని పరిశీలకులు అంటున్నారు. దానికి కారణం సినిమాల్లో నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటమే అంటున్నారు. ఇటీవల సినిమాలు చేయడానికి స్టార్ హీరోలతో మాట్లాడిన వాళ్ళు కూడా ఇప్పుడు వద్దు అని పక్కకు తప్పుకుంటున్నారు అనే వార్తలు వస్తున్నాయి. దానికి స్పష్టమైన కారణం ఏంటీ అనేది తెలియదు. 

 

ఇటీవల రామ్ చరణ్ తో ఒక సినిమాను దిల్ రాజు ప్లాన్ చేసి కూడా వద్దు అనుకున్నారు అని టాక్. మరి ఎందుకు ఏంటీ అనేది తెలియదు. అదే విధంగా మహేష్ తో ఒక సినిమాను మెగా హీరో ఒకరు ప్లాన్ చేసారు అని ఆయన కూడా వెనక్కు తగ్గారు అని టాలీవుడ్ లో అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అనేది చూడాలి. టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తే సినిమాలు బ్రతకడం అనేది కాస్త కష్టమే అని అంటున్నారు మరి. అసలు ఏ విధంగా ముందుకు వెళ్తారు ఏంటీ అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: