కెనడియన్‌ నటుడు డ్వేన్‌ జాన్సర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో హైయ్యస్ట్‌ పెయిడ్‌ సెలబ్రిటీ పేరు తెచ్చుకున్నాడు. సోషల్ మీడియా మార్కెటింగ్ ఫర్మ్‌ హూపర్ హెచ్‌క్యూ అందించిన వివరాల ప్రకార్‌ డ్వేన్‌ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసే ఒక్కో పోస్ట్‌కు దాదాపు 10 లక్షల 15 వేల అమెరికన్‌ డాలర్లు తీసుకుంటున్నాడు. ఈ మేరకు ఫాక్స్‌ న్యూస్‌ ఓ కథనం ప్రచురించింది.

 

డ్వేన్‌ను తన సోషల్ మీడియా పేజ్‌లో 189 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు. ఆయన తరువాతి స్థాయిలో కైలీ జెన్నర్‌ 183 మిలియన్ల ఫాలోవర్స్‌తో రెండో స్థానంలో ఉంది. హూపర్‌ హెచ్‌క్యూ సంస్థ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయన్సర్స్‌ తో మాట్లాడి, వారు అందుకుంటున్న పారితోషికాలకు సంబంధించిన వివరాలను సేకరించింది.

 

అయితే అందుకు సంబంధించి సరైన వివారాలు వెల్లడించకపోయినా.. ఒక్కో స్టార్‌ దాదాపుగా ఎంత వసూళు చేస్తున్నారు అన్న విషయాలను మాత్రం తెలుసుకోగలిగింది సదరు సంస్థ. ఈ లిస్ట్‌లో డ్వేన్‌ టాప్‌లో ఉండగా తరువాత స్థానంలో బ్యూటీ మొగళ్ జెన్నర్‌, ఆ తరువాత సాకర్‌ ప్లేయర్‌ క్రిస్టియానో రొనాల్డో, కిమ్‌ కర్థాషియన్‌లు ఉన్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Happy 4th. Let’s work. #rage #beinspired⚡️

A post shared by therock (@therock) on

మరింత సమాచారం తెలుసుకోండి: