చైనా సరిహద్దులో ఉద్రికత్త పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. చైనా ఆర్థిక మూలాలను టార్గెట్ చేస్తూ 59 చైనీస్‌ యాప్‌లను బ్యాన్‌ చేసింది. అందులో ఫేమస్‌ షార్ట్ వీడియో యాప్‌ టిక్‌ టాక్‌ కూడా ఉంది.

 

అయితే టిక్‌ టాక్‌ బ్యాన్‌ విషయంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొంత మంది భారత ప్రభుత్వానికి మద్ధతు ఇస్తుండగా మరికొందరు ఎంటర్‌టైన్‌మెంట్‌ యాప్‌ను బ్యాన్ చేయటం ఏంటని విమర్శిస్తున్నారు.

 

తాజాగా టిక్‌ టాక్‌తో టాప్‌ స్టార్‌గా ఎదిగిన జన్నత్‌ జుబైర్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించింది. జన్నత్‌కు టిక్‌ టాక్‌లో దాదాపు 2 కోట్ల 70 లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. ఆమె ట్వీట్స్‌కు 740 మిలియన్ల లైక్స్‌ ఉన్నాయి. తనకు ఇంత ఫేం తీసుకువచ్చిన టిక్‌టాక్‌ను బ్యాన్‌చేయటంపై జన్నత్‌ మద్దతు తెలిపింది.

 

నేను కేవలం టిక్‌ టాక్‌ వీడియోస్‌ను ఫస్ట్ కోసమే చేస్తాను. ఒకవేళ టిక్‌ టాక్‌ బ్యాన్‌ అయినా. నేను ఇతర మాధ్యమాల ద్వారా నా అభిమానులను ఎంటర్‌టైన్‌ చేస్తాను అంటూ ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేసింది జన్నత్‌. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

🙆🏼‍♀️

A post shared by jannat Zubair Rahmani (@jannatzubair29) on

మరింత సమాచారం తెలుసుకోండి: