సినిమాల విషయంలో స్టార్ నిర్మాతలు తీసుకునే జాగ్రత్తల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతీ సినిమాకు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి మరీ సినిమాలు చేస్తూ ఉంటారు. స్టార్ హీరోలు అయినా స్టార్ దర్శకులు అయినా స్టార్ హీరోయిన్ లు అయినా సరే ప్రతీ ఒక్కటి కూడా వాళ్ళు ప్రత్యేకంగా దృష్టి పెట్టి సినిమాలను చేస్తూ ఉంటారు. గతంలో చాలా స్వేచ్చగా సినిమాలు చేసే పరిస్థితి ఉండేది అనే చెప్పాలి. ఇప్పుడు మాత్రం నిర్మాతల్లో ఎక్కడ లేని భయం అనేది ఉంది అని చెప్పవచ్చు. అది ఏ హీరో అయినా సరే భయపడుతున్నారు వాళ్ళు. 

 

ఇక ఇప్పుడు మార్కెటింగ్ విషయంలో నిర్మాతలు ముందే జాగ్రత్త పడే ఆలోచనలో ఉన్నారు. సినిమాను ముందే అమ్మేసుకోవాలి అని భావిస్తున్నారు. గతంలో సినిమా కథను బయ్యర్లకు ముందు చెప్పే వారు కాదు. కాని ఇప్పుడు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వారికి ఇలా ఉంటుంది సినిమా ఇలా ఉంటుంది ఇష్టం అయితే కొనండి అనే విధంగా చెప్పేసే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. అలా అయితే నష్టాల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి అని భావిస్తున్నారు. సినిమా మొదలు పెట్టిన రోజు నుంచి కూడా మార్కెట్ ని అదే విధంగా చేసుకుంటే మంచిది అనే భావన లో ఉన్నారు. 

 

అగ్ర హీరోల సినిమాలు అయినా చిన్న హీరోల సినిమాలు అయినా సరే అదే విధంగా చేయడం మంచిది అని ఆలోచనలో ఉన్నారట. మహేష్ సినిమాను ఇదే విధంగా నిర్మాతలు అమ్మేసే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. మరి ఎంత వరకు నిజం అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. టాలీవుడ్ లో ఇప్పుడు అయితే స్టార్ హీరోల సినిమాలు ఏవి కూడా విడుదలకు సిద్దం గా లేవు అనే సంగతి తెలిసిందే

మరింత సమాచారం తెలుసుకోండి: