లాక్ డౌన్ లో బాగా కష్టాలు పడుతున్న వారిలో ప్రత్యేకంగా చెప్పే సినిమా ఆర్ఆర్ఆర్. ఆ సినిమా ఎప్పుడు వస్తుందా ఎంటి అని చాలా మంది ఆశగా ఎదురు చూస్తున్నారు గాని సినిమాకు సంబంధించిన ఏ వార్త కూడా ఫాస్ట్ గా రావడం లేదు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. దానికి కారణం సినిమాలో ఉన్న  స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు. వారి సినిమాలు అనగానే ఏదోక విధంగా ఫాన్స్ కి ఎప్పుడు కూడా ఒక క్రేజ్ అనేది తీసుకుని వస్తు ఉంటారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు కూడా దాదాపుగా అదే జరుగుతుంది 

 

అయితే ఈ సినిమా ఇప్పుడు లాక్ డౌన్ లో చాలా వరకు ఇబ్బంది పడుతుంది అనే సంగతి అందరికి తెలిసిందే. లాక్ డౌన్ లో ఈ సినిమా చాలా వరకు వాయిదా పడుతూ వస్తుంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ని మొదలు పెట్టాలి అని చూసినా సరే అది లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. దానికి కారణం సినిమా షూటింగ్ కి జనాలు ఎక్కువగా కావాల్సి ఉండటమే. అడవి లో సినిమా షూటింగ్ చేసే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతుంది. అందుకే ఇప్పుడు కాస్త లేట్ అవుతుంది అని అంటున్నారు. ఇక ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు అనేది  తెలియదు. 

 

ఇదిలా ఉంటే ఈ సినిమాకు మరో నటుడు కూడా షాక్ ఇచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. అవును ఇప్పుడు మరో నటుడు షాక్ ఇవ్వొచ్చు అంటున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. అతని పాత్ర ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం జరుగుతుంది. అతను ముంబై లో ఉండిపోయాడు. ఇప్పుడు వచ్చే అవకాశం మాత్రం లేదట.

మరింత సమాచారం తెలుసుకోండి: