టాలీవుడ్ లో సినిమాలకు మార్కెటింగ్ అనేది బాగా పెరిగిన తర్వాత స్టార్ హీరోలు చాలా వరకు కూడా జాగ్రత్తలు పడుతూనే సినిమాలను చేస్తున్నారు అనే చెప్పాలి. ఒక హీరో కి మరో నిర్మాతగా వ్యవహరించడం అనేది ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం. దీనికి కారణం సినిమాలకు మార్కెట్ అనేది భారీగా పెరగడమే. స్టార్ హీరోల సినిమా అనగానే సినిమా మొదలైన నాటి నుంచి అది విడుదల అయి జనాల్లోకి వచ్చే వరకు కూడా ఒక రేంజ్ లో ఫాలోయింగ్ ఉంటుంది. సినిమాకు కాసుల వర్షం కురుస్తుంది. 

 

ఇక ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఒక హీరోకి మరో హీరో నిర్మాతగా వ్యవహరించడం అనేది మనం తరుచుగా చూస్తూనే ఉన్నాం. స్టార్ హీరోల సినిమాల విషయంలో దాదాపుగా ఇదే పరిస్థితి ఉంది అని చెప్పాలి. దానికి కారణం సినిమాల్లో మార్కెట్ అనేది ఎక్కువగా ఉండటం. ఇటీవల అనీల్ రావిపూడి మహేష్ బాబు కి ఒక కథ చెప్పగా ఆ కథ ఆయనకు అంతగా నచ్చలేదు. అయితే తన ఇమేజ్ కి ఆ సినిమా సరిపోయే అవకాశం లేదు అని రామ్ చరణ్ కి అయితే సరిగా సరిపోయే అవకాశం ఉంది అని అన్నారు. 

 

అందుకే మహేష్ బాబు రామ్ చరణ్ తో ఆ సినిమాను చేయడానికి ముందుకు వచ్చాడు అని సమాచారం. టాలీవుడ్ లో చాలా వరకు ఈ సినిమా వస్తుంది అని అందరూ భావించారు. కాని ఈ సినిమా వచ్చే అవకాశం లేదు అనే విషయం స్పష్టంగా అర్ధమైంది జనాలకు. దానికి కారణం సినిమా బడ్జెట్ అనేది భారీగా ఉండే అవకాశం ఉండటం తో మహేష్ బాబు ఇప్పుడు వెనకడుగు వేసాడు అని ఈ సినిమాను చేయడం లేదు అని టాలీవుడ్ లో టాక్ మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: