టాలీవుడ్ లో అంజలి కి ఉన్న ఇమేజ్ కాస్త తక్కువే అని చెప్పాలి. ఆమె సినిమాలు అనగానే కాస్త అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ చూసే వారు గాని ఇప్పుడు ఆమె హీరోయిన్ గా చేసినా సరే ఆమె సినిమాలను చూసే పరిస్థితి దాదాపుగా లేదు అనే చెప్పాలి. స్టార్ హీరోల సినిమాల్లో ఆమె మంచి పాత్రలు చేసినా సరే ఆమె సినిమాలను చూసే వారు ఎవరూ లేరు. ఇక ఇప్పుడు ఆమె తెలుగు లో ఒక్క సినిమా చేసినా సరే చాలు అనుకునే విధంగా ఉంది. ఆమెకు అవకాశాలు ఇవ్వదానికిఎవారు ముందుకు వచ్చినా సరే ఆమె చాలా వరకు తక్కువకే సినిమాలు చేస్తుంది అని సమాచారం. 

 

ఇప్పుడు టాలీవుడ్ లో చాలా వరకు హీరోయిన్ ల విషయంలో జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుని సినిమాలు చేస్తున్నారు. అందుకే అంజలి కూడా తక్కువకి అయినా సరే తెలుగు లో ఒక మంచి సినిమా చెయ్యాలి అని చూస్తుంది. ఈ తరుణంలోనే ఆమె బాలయ్య బోయపాటి సినిమాను ఓకే చేసింది అని టాలీవుడ్ లో సమాచారం. ఆమె ఆ సినిమాను ఓకే చేసింది అని అందుకు కేవలం ఆమె 50 లక్షల లోపే తీసుకుంటుంది అని తెలుస్తుంది.  ఆ సినిమా హిట్ అయితే స్టార్ హీరోల పక్కన సినిమాలు చేయవచ్చు అని ఆమె భావిస్తుంది అని టాక్. 

 

ఇప్పటికే దీనికి సంబంధించి ఆమె కొందరు దర్శక నిర్మాతలతో చర్చలు జరుపుతుంది. నారప్ప సినిమాలో వెంకటేష్ భార్యగా తాను చెయ్యాలి అని భావించినా సరే అది సాధ్యం కాలేదు. అందుకే  ఆమె కాస్త గట్టిగా ఇప్పుడు వెంకటేష్ తో మరో సినిమా చెయ్యాలి అని ప్రయత్నాలు చేస్తుంది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి మరి. చూడాలి అసలు ఆమె ఏ సినిమాలో చేస్తుంది అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: