టాలీవుడ్ లో చాలా వరకు ఇప్పుడు సినిమాల విషయంలో దర్శక నిర్మాతలు జాగ్రత్తలు పడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు స్టార్ దర్శక నిర్మాతలు అందరూ కూడా ఓటీటీ సినిమాలతో పాటుగా చిన్న చిన్న సినిమాలను చేయడానికి ముందుకు వస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. దానికి కారణం వాటికి సోషల్ మీడియాలో మంచి స్పందన ఉండటం మార్కెటింగ్ ఎక్కువగా చేసే పని లేకపోయినా సరే కంటెంట్ ఉంటే మాత్రం సినిమా కచ్చితంగా హిట్ అవ్వడం అనేది అందరికి తెలిసిన విషయమే. అందుకే ఇప్పుడు ఆయా సినిమాలకు పెట్టుబడి పెట్టే విషయంలో ముందుకు వస్తున్నారు అని తెలుస్తుంది. 

 

ఇప్పుడు చిన్న సినిమాలతో పాటుగా  షార్ట్ ఫిలిమ్స్ ని ఓటీటీ లో విడుదల చేస్తే వాటికి మంచి స్పందన వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. అందుకే స్టార్ హీరోలతో సినిమాలు చేసే వారు కూడా ఇప్పుడు ఆ సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అని అంటున్నారు మరి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు  మన తెలుగులో వస్తున్న మరో వార్త ఏంటీ అంటే స్టార్ హీరోల సినిమాలు చేసే దర్శక నిర్మాతలు నష్టాల నుంచి బయటకు రావడానికి గానూ ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారు అని. చాలా మంది ఇప్పుడు ఆర్ధికంగా నష్టపోయారు అని వాళ్ళు అందరూ కూడా ఇలా సినిమాలు చేసే అవకాశం ఉంది అని సమాచారం. 

 

ఇదే విషయం స్టార్ హీరోలకు కూడా చెప్పి మీరు నచ్చిన వారి తో సినిమాలు చేసుకోవచ్చు అని తాము కొన్ని  రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉంటామని చెప్పారట. ఇప్పుడు దిల్ రాజు చిన్న సినిమాలను పైకి తీసుకుని వచ్చే ఆలోచనలో ఉన్నారు అనే వార్తలు వస్తున్నాయి మరి. అది ఎంత వరకు నిజం అనేది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: