టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న వాతావరణం చూస్తే చిన్న హీరోలు కాస్త ఇబ్బంది పడుతున్నట్టే కనపడుతుంది అని చెప్పాలి. చిన్న హీరోలు చాలా వరకు  కూడా జాగ్రత్తగా సినిమాలు చేసే పరిస్థితి అయితే ఉంది అనే మాట వాస్తవం. పాపం గతంలో మాదిరిగా వాళ్ళతో సినిమాలు చేసే దర్శక నిర్మాతలు ఎవరూ కూడా లేరు అనేది చెప్పవచ్చు. దానికి కారణం సినిమాలకు మార్కెట్ అనేది తగ్గడమే. వారి సినిమాలు అనగానే ఫాన్స్  ఎక్కువగా ఆసక్తి చూపించే అవకాశం ఇప్పుడు లేదు. అయితే ఓటీటీ లో మాత్రం వారి సినిమాలకు మంచి స్పందన అయితే వస్తుంది. 

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు వారి తో సినిమాలు చేసే దర్శక నిర్మాతలు మాత్రం వారిని ఓటీటీ లో అయితే మాత్రమే సినిమాలు చెయ్యాలి అని చెప్పారు అని టాక్ మరి. దానికి కారణం ఏంటీ అలా ఎందుకు చెప్పారు అనేది స్పష్టంగా తెలియదు గాని ఇప్పుడు అయితే అలాగే ముందుకు  వెళ్తున్నారు అని అంటున్నారు. స్టార్ హీరోలు అయినా చిన్న హీరోలు అయినా సరే  ఇప్పుడు బడ్జెట్ పెట్టే విషయంలో నిర్మాతలు వెనక్కు తగ్గుతున్నారు. ఇక ఇప్పుడు ఉన్న విషయం  ఇంకొకటి ఏంటీ అంటే నిఖిల్ నానీ శర్వానంద్ వంటి హీరోలకు కాస్త కష్ట కాలం నడుస్తుంది అనే ప్రచారం మాత్రం బాగా జరుగుతుంది. 

 

చాలా వరకు వారు బాగా ఇబ్బంది పడుతున్నారు అని చెప్తున్నారు. టాలీవుడ్ లో కాస్త కొత్తగా ఇప్పుడు ప్రయత్నాలు చేయడం తో దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నారు. తమ సినిమా భిన్నంగా ఉండే విధంగానే చాలా వరకు సినిమాలు చేసే పరిస్థితి అయితే ఉంది అనే మాట వాస్తవం. అందుకే ఇప్పుడు చిన్న హీరోలను అసలు ఎవరూ కూడా పట్టించుకునే పరిస్తితి లేదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: