ప్రపంచవ్యాప్తంగా బిగ్ బాస్ రియాల్టీ షోకి క్రేజ్ ఎంత ఉందో అందరికీ తెలుసు. మన దేశంలో కూడా మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా ఉన్న నాటినుండి తిరుగులేని క్రేజ్ హిందీలో దక్కించుకుంది. గత 13 సంవత్సరాలుగా సల్మాన్ ఖాన్ ఈ షోకి యాంకర్ గా విజయవంతంగా రాణిస్తున్నారు. 13 సీజన్లు ప్రేక్షకులను ఎంతగానో అలరించడం తో నెక్స్ట్ స్టార్ట్ కాబోయే 14వ సీజన్ కోసం షో నిర్వాహకులు భారీ స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సీజన్ కోసం సల్మాన్ ఖాన్ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

 

దాదాపు వంద రోజులు సీజన్ 14 నడుస్తోంది. అయితే ఈ సీజన్ కోసం సల్మాన్ ఖాన్ ఒక్క రోజుకు 16 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పైగా కేవలం శనివారం మరియు ఆదివారం మాత్రమే సల్మాన్ ఖాన్ కనిపిస్తాడు. మొత్తం మీద లెక్క చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ 14లో ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే కనిపిస్తాడు. దానికిగాను సల్మాన్ ఖాన్ రోజుకి పదహారు కోట్లు  తీసుకుంటే 28 రోజులకు మొత్తం 448 కోట్లు సల్మాన్ అందుకుంటున్నాట్లు టాక్. అయితే ఇందులో ఎంత నిజం ఉందొ తెలియదు కానీ ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

ఇక  ప్రస్తుతం సల్మాన్  హీరోగా ‘రాధే’తో పాటు ‘కభీ ఈద్ కభీ దీవాళి’ లైన్ లో ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ లు ఆగిపోవటంతో త్వరలో స్టార్ట్ అయ్యే బిగ్ బాస్ సీజన్ 14 కోసం సల్మాన్ రెడీ అవుతున్నారట. మరోపక్క తెలుగులో కూడా త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 4 స్టార్ట్ కానుంది. కరోనా వైరస్ ఎఫెక్ట్ తో ఈసారి 50 రోజులే తెలుగు లో ప్రసారం కానున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: