దేశాన్ని వణికించేస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడు మరింత వికృతంగా మారింది. ఈ ఉపద్రవాన్ని ముందే ఊహించిన దేశ ప్రధాని మోదీ మార్చి నెలలో దేశం మొత్తం లాక్ డౌన్ విధించారు. ప్రజలకు అవసరమైన అత్యవసర సేవలు మినహా దేశం మొత్తం నెల రోజులకు పైగా స్థంభించిపోయింది. ఈ సమయాన్ని ప్రజలు కుటుంబ సభ్యులతో గడిపారు. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. మరికొందరు లాక్ డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయినవారికి అన్నదానం చేశారు. వీరిలో ప్రముఖ సినీ నటి ప్రణిత సుభాష్ తనలోని సేవా గుణాన్ని బయటి ప్రపంచానికి తెలిసేలా చేశారు.

IHG

 

తాను కేవలం తెర మీద ప్రేక్షకుల్ని మెప్పించటమే కాదు.. ఆపన్నులకు విపత్కర సమయంలో సాయం కూడా అందించగలనని నిరూపించింది. 21 రోజుల్లో 75వేల ఆహార పొట్లాలు స్వయంగా ప్యాక్ చేసి ఆపన్నులకు అందించింది. నగదు రూపంలో విరాళాలు అందించింది. బెంగళూరులోని 100 ఆటోవాలాలకు శానిటైజర్లు అందించింది. ఆటోల్లో డ్రైవర్ కు ప్యాసింజర్లకు మధ్య ప్లాస్టిక్ షీట్ అటాచ్ చేసింది. స్టార్ హీరోయిన్ కాకపోయినా.. కోట్లలో రెమ్యునరేషన్ తీసుకోకపోయినా కూడా తన సేవా కార్యక్రమాలను మాత్రం విస్మరించలేదు. నిత్యం ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చేందుకు శ్రమించింది. ప్రణీత చేసిన ఈ చారిటీ దేశం మొత్తం ప్రశంసలు అందుకుంది.

IHG

 

డాక్టర్లైన తన తల్లిదండ్రుల నుంచే తనకు ఈ సేవా కార్యక్రమాలు అలవాటు అయ్యాయని ప్రణీత అంటుంది. చిన్నప్పటి నుంచి వారి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు చూసి ఇన్ స్పైర్ అయ్యానంటోంది ఈ బెంగళూరు బ్యూటీ. ప్రేక్షకులు మెచ్చేలా సినిమాలు చేయటమే కాదు.. వారు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం కూడా ముఖ్యమే అంటోంది. తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన ప్రణీత ఈ లాక్ డౌన్ సమయంలో ప్రజల హృదయాలను గెలుచుకుంది.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: