‘బొమ్మాళీ.. నిన్నొదలా..’ అంటూ తెరపై భయంకరమైన అఘోరాగా కనిపించిన ‘సోనూసూద్’లో ఓ మనసున్న మనిషి ఉన్నాడని ఊహించలేదు ఎవరూ. అతను సినిమాల్లో విలన్ పాత్రలు చేస్తాడు కదా..  అనుకున్నవారికి నిజజీవితంలో హీరోగానే కనిపించాడు. కరోనా మహమ్మారి దేశంలోని ఎంతోమంది వలస కార్మికులకు ఉపాధి లేకుండా చేసింది. రవాణా సౌకర్యం లేదని తెలిసినా.. మండే ఎండల్లోనే వందల కిలోమీటర్లు కాలినడకనే బయలుదేరారు. మొదట్లో ప్రభుత్వాలు కూడా పట్టించుకోని వీరి బాధను గుర్తించింది ‘సోనూ సూద్’ మాత్రమే.

IHG

 

సొంతూళ్లకు కాలినడకన వెళుతున్నవారి కోసం ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఏర్పాటు చేశాడు. ఎంతమంది వచ్చిన కాదనలేదు. మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని మరీ వారి స్వస్థలాలకు చేర్చారు. దేశంలోని ఏ ప్రదేశానికి వారు వెళ్లాలో తెలుసుకుని వారిని అక్కడికే చేర్చారు. కొన్ని వేల మందిని తమ స్వస్థలాలకు అన్ని జాగ్రత్తలతో పంపించి వారి గుండెల్లో కొలువై నిలిచిపోయాడు. సోనుసూద్ చేసిన సేవ దేశంలో మార్మోగిపోయింది. పెద్ద పెద్ద హీరోలు చేయలేని పనిని క్లిష్ట సమయంలో ముందుండి నడిపించాడు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మొదలు పెట్టిన పనిని నిర్విఘ్నంగా పూర్తి చేశాడు.

IHG

 

సోనూసూద్ చారిటీతో ప్రభుత్వాలు కదిలొచ్చాయి. శ్రామిక్ ఎక్స్ ప్రెస్ లు నడిచాయి. ఆయా రాష్ట్రాల్లో నడిచి వెళుతున్న కూలీలకు బస్సులు ఏర్పాటు చేశాయి అక్కడి ప్రభుత్వాలు. వారిని అన్నపానీయాలు అందించాయి. మొత్తంగా ఒక్కడు దేశాన్ని కదిలించాడని చెప్పాలి. ముంబయ్ లోని తనకున్న హోటల్ ను కూడా లాక్ డౌన్ వేళ చారిటీకే ఉపయోగించి తన పెద్ద మనసు చాటుకున్నాడు. ‘డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్’ సామెతలా సోనుసూద్ తెరపై విలనే కానీ.. జీవితంలో మనసున్న మనిషని.. నిజమైన హీరో అని తెలిసేలా చేసింది లాక్ డౌన్.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: