యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తీసిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయమైన దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి, తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టారు. ఇక ఆ తరువాత నుండి వరుసగా చేస్తున్న ఒక్కో సినిమాతో ఒక్కో విజయాన్ని చేజిక్కించుకుంటూ ముందుకు సాగిన రాజమౌళి, ఇటీవల ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన బాహుబలి సిరీస్ లోని రెండు సినిమాలతో దర్శకుడిగా ప్రపంచస్థాయి గుర్తింపుని సంపాదించారు. ఇక గత కొన్నాళ్లుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో తన తదుపరి సినిమా ఆర్ఆర్ఆర్ ని తీస్తున్న రాజమౌళి, కొన్నాళ్ల నుండి కరోనా ఎఫెక్ట్ కారణంగా మన దేశంలో లాక్ డౌన్ విధించడంతో దాని షూటింగ్ ని కూడా నిలుపుదల చేసారు. 

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=RRR MOVIE' target='_blank' title='rrr-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>rrr</a> with <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CHARAN' target='_blank' title='ram charan-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ram charan</a> and <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=JR NTR' target='_blank' title='jr ntr-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>jr ntr</a> is now postponed to ...

అతి త్వరలో తదుపరి షెడ్యూల్ ని జరుపుకోనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ తెలంగాణ పోరాట వీరుడు కొమరం భీం గా నటిస్తుండగా, రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు రామ్ చరణ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ టీజర్ లకు ప్రేక్షకులు, ఫ్యాన్స్ నుండి భారీ రెస్పాన్స్ రావడం జరిగింది. ముందుగా ఈ ఏడాది జులై 30న రిలీజ్ కావలసిన ఈ సినిమాని గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ లేట్ అవడం కారణంగా వచ్చే ఏడాది జనవరి 8కి వాయిదా వేశారు. ఇకపోతే మూడు నెలలుగా కరోనా విలయతాండవంతో ఈ సినిమా షూట్ కూడా ఆగిపోవడంతో యూనిట్ కొంత ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఎనభై శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా అతి త్వరలో తదుపరి షెడ్యూల్ జరుపుకోనున్నప్పటికీ కూడా తక్కువ మంది సభ్యులతో షూటింగ్ ఎలా చేయాలా అనే ఆలోచన చేస్తున్నారట రాజమౌళి. 

 

మరోవైపు సినిమాకు సంబంధించి విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఇంకా చాలా వరకు పెండింగ్ ఉందని సమాచారం. కొద్దిరోజుల క్రితం సినిమా రిలీజ్ డేట్ విషయమై దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య కూడా పక్కాగా అనుకున్న విధంగా తమ సినిమాని రిలీజ్ చేస్తాం అనేది తేల్చి చెప్పలేం అని అన్నారు. అలానే ఇప్పటి పరిస్థితులను బట్టి చూస్తుంటే పక్కాగా ఆర్ఆర్ఆర్ సంక్రాంతి సమయానికి వచ్చే పరిస్థితులు చాలావరకు లేవని, అది ఈ పాటికే తెలుసుకున్న పలువురు ఇతర సినిమాల నిర్మాతలు, తమ సినిమాలను సంక్రాంతి రేస్ లోకి తీసుకువచ్చేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది . మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజం అయితే మాత్రం ఇది ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ కు భారీ షాక్ అని చెప్పకతప్పదు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: