కరోనా ప్రభావంతో సినిమా షూటింగ్ ఆపేసి ఇంట్లో కూర్చుంటే ఆర్జివి మాత్రం వరుసగా సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు. ఆర్జివి వరల్డ్ అని ఏటిటి ద్వారా ఆర్జివి తన వెబ్ మూవీస్ రిలీజ్ చేస్తున్నాడు. మియా మాల్కోవా క్లైమాక్స్,  శ్రీ రాపాకతో నగ్నం సినిమా చేసిన వర్మ లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్, 12'ఒ క్లాక్ సినిమాలను తీస్తున్నాడు. 12'o క్లాక్ టీజర్ కూడా రిలీజ్ చేశాడు. ఈ లాక్ డౌన్ టైం లో బాగుపడిన సిని మేకర్ ఎవరంటే అది ఒక్క రాం గోపాల్ వర్మ మాత్రమే అని చెప్పొచ్చు. తను తీసే సినిమాలు కళాకండాలు కాకపోయినా సరే అడల్ట్ కంటెంట్ తో సినిమాలను ప్రమోట్ చేసుకుంటూ ప్రేక్షకుల వీక్ నెస్ తో ఆడుకుంటున్నాడు.

 

ఇదిలాఉంటే కొత్తగా తన సినిమాలో మరో కొత్త హీరోయిన్ ను పరిచయం చేస్తూ వర్మ లేటెస్ట్ గా పెట్టిన పిక్ వైరల్ గా మారింది. ఆర్జివి దృష్టిలో పడ్డ మరో భామ అప్సరా రాణి. ఒరిస్సా నుంది వచ్చిన ఈ హీరోయిన్ లేటెస్ట్ ఫోటో షూట్ కుర్రాళ్లను అలరిస్తుంది. ఆమెతో ఓ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చేస్తాడట వర్మ. తను తీసేది ఎలాంటి జానర్ సినిమా అయినా అందాల భామల గ్లామర్ షోకి అడ్డు అదుపు ఉండదు. లేటెస్ట్ గా అప్సర అందాలను కూడా కొత్త యాంగిల్ లో చూపించాలని ప్రయత్నిస్తాడు వర్మ.

 

అందుకు ఉదహరణగా ఆమెని పరిచయం చేస్తూ తీసిన ఫోటో షూట్ ను చూస్తే అర్ధమవుతుంది. కచ్చితంగా అప్సరా రాణితో వర్మ మరోసారి ప్రేక్షకులను వెర్రివాళ్లను చేయడం ఖాయం. థ్రిల్లర్ జానర్ అని పేరుకి చెప్పి సస్పెన్స్, భయంతో పాటుగా హీరోయిన్ అందాలను ఫ్రీగా చూపించేస్తాడు. మరి క్లైమాక్స్ సినిమాను 100, నగ్నం కు 200 టికెట్ ప్రైజ్ పెట్టిన ఆర్జివి ఈ ఒరిస్సా అందాలకు ఎలాంటి రేటు ఫిక్స్ చేస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: