ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినిమా ధియేటర్లు మూతపడి 100 రోజులు దాటిపోయిన పరిస్థితులలో ఇక ధియేటర్లు శాస్వితంగా మూతపడి పోతాయా అంటూ కొన్ని విశ్లేషణలు వస్తున్నాయి. దీనికి కారణం రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కూడ భారతదేశంలో ఇన్ని రోజులు ధియేటర్లు మూతపడి లేదు.


ఇలాంటి పరిస్థితులలో జనం ధియేటర్లకు వచ్చి సినిమాలను చూసే అలవాటుకు పూర్తిగా దూరం అయిపోయే ఆస్కారం ఉంది అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేసే ఒక సినిమా విడుదలైనప్పుడు మాత్రమే ఫిలిం ఇండస్ట్రీకి పూర్వ వైభవం వచ్చే ఆస్కారం ఉంది.


దీనితో ఇప్పుడు అందరి దృష్టి రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ పైనే ఉంది. ఈ పరిస్థితుల మధ్య ఈమూవీ తమిళ వెర్షన్ కు డైలాగ్స్ రాస్తున్న మధన్ కార్కి ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. ‘ఆర్ ఆర్ ఆర్’ లో వచ్చే దేశభక్తి సీన్స్ చూసిన వారికి రోమాలు నిక్కబొడుచుకునేలా రాజమౌళి ప్రతి సీన్ ను డిజైన్ చేసాడని ఈమూవీలో అందమైన విజువల్స్‌తో పాటు ఇంతకుముందు ఎన్నడూ చూడని యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయని చెపుతూ ఈ మూవీ పై విపరీతంగా అంచనాలు పెంచుతున్నాడు.


సాధారణంగా రాజమౌళి సినిమాలలో మాటలు చిన్నవిగా ఉంటాయని అయితే ఈ మూవీలో రాజమౌళి శైలికి భిన్నంగా కొన్ని భారీ డైలాగ్స్ ఉన్నాయని ఆ డైలాగ్స్ లోని ప్రతి అక్షరంలో దేశభక్తి ప్రతిద్వనిస్తుంది అంటూ మదన్ కార్కి లీకులు ఇస్తున్నాడు. వాస్తవానికి కరోనా సమస్యలు రాకుండా ఉండి ఉంటే ఈమూవీ వచ్చే సంవత్సరం జనవరిలో ఖచ్చితంగా విడుదల అయి ఉండేది. అయితే ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ ఆగిపోయిన పరిస్థితులలో ఈమూవీ వచ్చే ఏడాది విడుదల కూడ సందేహం అంటూ కొన్ని జాతీయ మీడియా సంస్థలు నెగిటివ్ ప్రచారం చేస్తున్న పరిస్థితులలో ఈ మూవీకి క్రేజ్ తగ్గకుండా రాజమౌళి ఇలా మదన కార్కి తో ఈమూవీలోని డైలాగ్స్ గురించి లీకులు ఇప్పిస్తూ అంచనాలు పెంచుతున్నాడు అని అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: