టాలీవుడ్ చరిత్రలో రామ్ గోపాల్ వర్మ రేంజ్ లో వివాదాలతో సావాసం చేసిన దర్శకుడు మరొకరు ఉండరు అనేది వాస్తవం. ఆయన ఏది మాట్లాడినా సరే అది దాదాపుగా వివాదం గానే ఉంటుంది. ఆయన ఏది చేసినా సరే అది సాదాపుగా వివాదమే అవుతుంది అని చెప్పాలి. ఆయన చేస్తున్న సోషల్ మీడియా పోస్ట్ లు ఆయన మాట్లాడే కొన్ని మాటలు ఆయన తీస్తున్న సినిమాలు అన్నీ కూడా వివాధలతోనే ఎక్కువగా ఉంటున్నాయి అనేది వాస్తవం. ఆయన లాక్ డౌన్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. 

 

ఏ ఇబ్బంది అనేది లేకుండా ఆయన సినిమాల నిర్మాణం లో దూసుకుని పోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తున్న అంశంగా చెప్పాలి. ఆయన సినిమాలు హిట్ అవుతున్నాయా ఫ్లాప్ అవుతున్నాయ అనేది పక్కన పెడితే ఆయన మాత్రం సినిమాలు చేసే విషయంలో ఎక్కడా కూడా వెనకడుగు అనేది వేయడం లేదు అనే విషయం స్పష్టంగా చెప్పాలి. ఆయన ఈ లాక్ డౌన్ లో దాదాపు ఆరు సినిమాలను జనాలకు చూపించారు. ఆయన ఏదోక సినిమా ప్రకటన చేస్తూనే ఉన్నారు. అది వివాదం అయినా మరొకటి అయినా సరే. 

 

టాలీవుడ్ లో సినిమాలు చేయడానికి ఇబ్బంది పడుతున్న సమయం లో ఆయన మాత్రం వరుసగా సినిమాలు చేయడం వాటిని విడుదల చేయడం అన్నీ కూడా చాలా మందికి షాక్ గానే ఉన్నాయి అని చెప్పాలి. ఇప్పుడు ఆయన ఒక సినిమాను ఏదో మళ్ళీ ప్లాన్ చేసి దాని టైటిల్ కూడా ప్రకటించడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసిన అంశంగా చెప్పాలి. ఆయన వచ్చే ఏడాది ఆరు సినిమాలు చేసే అవకాశం ఉందనే టాక్ టాలీవుడ్ లో వస్తుంది మరి. ఏ దర్శకుడు కూడా ఈ విధంగా  సినిమాలు చేయడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: