కరోనా మహమ్మారి సృష్టిస్తున్న భీభత్సం అంతా ఇంతా కాదు. మహమ్మారి కారణంగా చేతిలో పనులు లేక జీవనాధారాన్ని కోల్పోయి తినడానికి తిండి లేక చాలా అవస్థలు పడుతున్నారు. మహమ్మారి దెబ్బకు చాలా సంస్థలు మూతబడ్డాయి. అనేక పరిశ్రమల్లో పనులన్నీ ఆగిపోయాయి. కోవిడ్ 19 కారణంగా తీవ్రంగా నష్టపోయిన పరిశ్రమల్లో చిత్ర పరిశ్రమ కూడా ఒకటి. థియేటర్లు లేక, షూటింగులు ఆగిపోయి నిర్మాతకి పెనుభారంగా మారింది.

 

అయితే థియేటర్లు లేకపోవడంతో చాలా సినిమాలు ఓవర్ ద టాప్ ద్వారా డైరెక్ట్ రిలీజ్ అవుతున్నాయి. లాక్డౌన్ మొదట్లో ఈ విధంగా రిలీజ్ చేయడానికి చాలా మంది ముందుకు రాలేదు. కానీ మహమ్మారి ప్రభావం ఇప్పుడప్పుడే తగ్గేలా లేకపోవడంతో అప్పుల భారం తట్టుకోవడం కష్టంగా మారడంతో ఇక చేసేదేమీ లేక సినిమాలని ఓటీటీలో రిలీజ్ చేయడానికే ముందుకు వస్తున్నారు. అయితే చిన్న సినిమాలకి ఈ విధానం బాగానే ఉంది. కానీ పెద్ద సినిమాల పరిస్థితే ఎటూ కాకుండా ఉంది.

 

సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన చిత్రానికి ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. నిజానికి పెద్ద సినిమా కాదు. మెగా మేనల్లుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమా కోసం నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ చాలానే ఖర్చు పెట్టారు. దాదాపు 25కోట్లకి పైగానే పెట్టారని టాక్. సాధారణంగా ఒక హీరో ఎంట్రీ సినిమాకి ఆ రేంజ్ లో ఖర్చు పెట్టడం పెద్ద విషయమే.

 

అయితే ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేద్దామంటే నిర్మాతలు పెట్టిన మొత్తం రావడం కష్టమేనట. స్టార్ క్యాస్టింగ్ లేని చిత్రాలకి ఓటీటీలు అంత చెల్లించవు. అదీగాక ఈ సినిమాపై నిర్మాతలకి చాలా నమ్మకం ఉందట. అందువల్ల నిర్మాతపై వడ్డీభారం పెరుగుతున్న థియేటర్లలోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారట. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాకి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: