టాలీవుడ్ లో చాలా మంది ఇప్పుడు సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉండగా రానా నుంచి  వచ్చిన ఒక పెళ్లి ప్రకటన మాత్రం జనాలకు ఒక ఫుల్ జోష్ అనేది ఇచ్చింది అనే చెప్పాలి. రానా పెళ్లి వార్త కోసం జాతీయ మీడియా కూడా ఒక రేంజ్ లో ఎదురు చూసింది అనే మాట అర్ధమైంది. అతని పెళ్లి వార్త తెలుగు మీడియా కంటే ముందు జాతీయ మీడియా నే ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఆ పెళ్లి గురించి అక్కడి జనాలు కూడా ఆ రేంజ్ లో ఎదురు చూస్తున్నారా అంటూ చాలా మంది షాక్ అయ్యారు కూడా .

 

టాలీవుడ్ లో ఈ పెళ్లి ఒక సంచలనం అయింది. ఈ పెళ్లి గురించి జరిగిన ప్రచారం వస్తున్న వార్తలు రానా విడుదల చేస్తున్న  కొన్ని ఫోటోలు అన్నీ కూడా ఫాన్స్ లో ఒక రేంజ్ లో క్రేజ్ ని పెంచాయి. ఈ పెళ్లి ఎప్పుడు చేసుకునే అవకాశం ఉంది అనే దాని మీద మాత్రం చాలానే కథనాలు వస్తున్నాయి గని చివరికి వచ్చే నెల 7 న ఈ పెళ్లి చేసుకునే అవకాశం ఉంది అనే దాని మీద స్పష్టత అయితే వచ్చింది అనే చెప్పాలి. ఈ పెళ్లి కోసం ఇప్పటికే రానా ఫ్యామిలీ మిహికా ఫ్యామిలీ ఆహ్వానాలు కూడా సిద్దం చేసింది అని అంటున్నారు. 

 

మీడియా ప్రముఖులు సహా సిని ప్రముఖులు కొందరికి మాత్రమే ఏ హడావుడి లేకుండా ఈ  పెళ్ళికి సంబంధించి ఆహ్వానాలు ఇచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి నిజమా కాదా అనేది తెలియదు గాని ఈ  పెళ్లి వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నాయి అని అంటున్నారు. అది ఎంత వరకు నిజం అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: