అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ తన కుటుంబం కోసం విలాసవంతమైన ఇంటిని కొన్న సంగతి తెలిసిందే. కేవలం అయిదు సంవత్సరాల్లోనే కోటీశ్వరుడైన విజయ్ దేవరకొండ తన తల్లిదండ్రుల ఆశీస్సులతోనే, ఆశీర్వచనాలతోనే తాను ఇంత స్థాయికి ఎదిగానని ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. తన తమ్ముడిని, తల్లిదండ్రులను ఎంతగానో ప్రేమించే విజయ్ దేవరకొండ లాక్ డౌన్ సమయంలో తన కుటుంబంతో గడిపే అవకాశం దొరికింది. ఒకవైపు మధ్యతరగతి కుటుంబాలకు సహాయం చేస్తారని మరొకవైపు కుటుంబంతో హ్యాపీగా సమయాన్ని గడుపుతూ తన క్వారంటైన్ సమయంలో కాలక్షేపం చేసాడు విజయ్ దేవరకొండ.

మే 9వ తారీకున పుట్టినరోజు జరుపుకున్న విజయ్ దేవరకొండ ఒకరోజు గడిచిన తర్వాత తల్లి దేవరకొండ మాధవి తో సమయాన్ని గడుపుతూ కనిపించాడు. మే 10వ తేదీన విజయ్ దేవరకొండ  తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తన తల్లి తో దిగిన ఫోటో ని పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలో విజయ్ దేవరకొండ, దేవరకొండ మాధవి కలిసి బోర్డు గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోటోకి మమ్మీ లవ్ యు అనే ఒక క్యాప్షన్ కూడా జోడించాడు విజయ్ దేవరకొండ. లాక్ డౌన్ సమయంలో బీ ద రియల్ మాన్ ఛాలెంజ్ ను కూడా స్వీకరించి ఇంట్లో పనులు చేసి చూపించాడు.
లాక్‌డౌన్‌ ఈ సమయంలో తాను ఒక కుక్క పిల్లను కూడా దత్తత తీసుకున్నాడు. ఈ విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులకు తెలిపాడు. ఫోటో షూట్ కి సంబంధించిన మూడు ఫోటోలు కూడా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసి అభిమానులను ఎంటర్టైన్ చేశాడు. బాహ్య ప్రపంచంలో అడుగుపెట్టింది లార్డ్ దాని సమయంలో ఆహారం లేక ఇబ్బంది పడుతున్న వారికి తన వంతు సహాయం చేసి అందరి ప్రశంసలను దక్కించుకున్నాడు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: