మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి తన భార్య అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2012వ సంవత్సరంలో అంగరంభవైభవంగా పెళ్లి చేసుకున్న ఉపాసన, రామ్ చరణ్ ఎంతో అన్యోన్యంగా వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. రామ్ చరణ్ కోసం తనని తాను సన్నగా మార్చుకున్న ఉపాసన కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. వీళ్లిద్దరూ తమ కాలేజీ రోజుల నుండి మంచి స్నేహితులుగా ఉండేవారు.


ఆరెంజ్ సినిమా తర్వాత అనగా 2010వ సంవత్సరం తర్వాత ఇరువురు డేటింగ్ చేసుకోవడం ప్రారంభించారు. తమ పెద్దలేవ్వరికీ చెప్పకుండా ఒకానొక రోజు ఇద్దరూ కలిసి గుడిని దర్శించుకోగా కొంత సమయం తర్వాత ఈ విషయం పెద్దలకు తెలియడంతో ఒకరి కుటుంబంతో మరొకరు మాట్లాడి పెళ్లి చేశారు. ఈ స్టార్ దంపతులకు గుర్రాలు, సినిమాలు, సముద్రంలో డైవింగ్ చేయడం, సినిమాలు చూడడం అంటే మిక్కిలి ఇష్టం. కఠోరమైన వ్యాయామం చేయడం కూడా ఇద్దరికీ ఇష్టమే.

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా భారతదేశంలో మూడు నెలల పాటు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఇంటికే పరిమితమైన రామ్ చరణ్ తన భార్యతో సమయాన్ని గడిపాడు. మార్చి 27వ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఉపాసన ప్రత్యేకంగా కేక్ తయారు చేసి అతడి పుట్టినరోజు గొప్పగా జరిపింది. అయితే ఏప్రిల్ 16వ తేదీన ఉపాసన కోసం డిన్నర్ ప్రిపేర్ చేసి తన భార్యతో పాటు అందరిని ఫిదా చేశాడు రామ్ చరణ్. వంట చేసిన తర్వాత కిచెన్ కూడా తానే స్వయంగా క్లీన్ చేశాడట. ఈ విషయాన్ని ఉపాసన కొణిదల తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించింది. ఏదేమైనా భార్య పైన ప్రేమతో చాలా బాగా వంట చేసి మంచి భర్తగా పేరు తెచ్చుకున్నాడు రామ్ చరణ్. జులై 20 వ తేదీన ఉపాసన కొణిదెల పుట్టినరోజు కాగా...ఆమెకు శుభాకాంక్షలు రామ్ చరణ్ ఎలా విష్ చేస్తాడో చూడాలిక.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: