నేను లోకల్, నేను శైలజ, మహానటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కీర్తి సురేష్ ప్రస్తుతం తన చిత్రాలలో తల్లి పాత్రలో నటిస్తూ రిస్కు చేస్తుందని చెప్పుకోవచ్చు. సాధారణంగా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఏ హీరోయిన్ తల్లి పాత్రల్లో నటించడానికి అంతగా ఆసక్తి చూపరు. కానీ కీర్తి సురేష్ దానికి భిన్నంగా తప్పటడుగులు వేస్తోంది. ఆమె నటించిన పెంగ్విన్ సినిమా పలు భాషలలో గత నెల డిజిటల్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు పది రోజులు ఉంది అనగా... అన్ని టీవీ చానల్స్ లలో దీని గురించే విస్తృత ప్రచారం జరిగింది. కానీ జూన్ 19వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదలైన పెంగ్విన్ మూవీ ఏ ప్రేక్షకుడిని అలరించ లేకపోయింది.


సినిమా ప్రారంభం కాగానే చాలా న్యారేషన్ చాలా నెమ్మదిగా ఉందని చెప్పుకోవచ్చు. కొంత సమయం గడిచిన తర్వాత అయినా కథనం స్పీడ్ గా చూపిస్తారని అందరూ భావించారు కానీ. సినిమా ప్రారంభమై 60 నిమిషాలు దాటినప్పటికీ సన్నివేశాలు అదేవిధంగా నత్తనడకన సాగాయి. దీంతో ఈ సినిమా ప్రేక్షకుడి సహనానికి పరీక్షగా మారింది అని చెప్పుకోవచ్చు. ఒక్క కీర్తి సురేష్ అని తప్ప సపోర్టింగ్ పాత్రలలో నటించిన మిగతా వారందరూ చాలా చండాలంగా నటించారని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ సినిమాలో కీర్తి సురేష్ అన్న కాకుండా వేరొకరు నటించినట్లయితే పెంగ్విన్ ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యేదో ఊహించుకోవచ్చు.


రిథమ్ (కీర్తి సురేష్) అనే గర్భవతి యొక్క పెద్ద కుమారుడు అజయ్ (మాస్టర్ అద్వైత్) తప్పిపోయిన ఆరు సంవత్సరాలు గడుస్తున్నా అతని ఆచూకీ ఎక్కడా లభించదు. కానీ, చార్లీ చాప్లిన్ వేషంలో వచ్చిన ఒక నేరస్థుడు అజయ్ ని కిడ్నాప్ చేసి ఇతర పిల్లలను కూడా కిడ్నాప్ చేశాడని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆరు సంవత్సరాలు గడిచినా రిథమ్ తన కొడుకు ఆచూకీ లభ్యం అవుతుందోనని ఒంటరిగానే దర్యాప్తు చేస్తూ ఉంటుంది.


ఎట్టకేలకు ఈ తప్పిపోయిన కిడ్నాప్ కేసులో ఆమె ఒక షాకింగ్ విషయాన్ని తెలుసుకుంటుంది.  అజయ్‌ను కిడ్నాప్ చేసినది ఎవరు?  వారి ఉద్దేశ్యం ఏమిటి? వంటి ప్రశ్నలకు దర్శకుడు పెద్ద తెరపై సమాధానం ఇచ్చాడు. కథాంశం బాగానే ఉంది కానీ తెరపై ఎగ్జిక్యూషన్ చాలా చెత్తగా ఉండటం వలన ఈ సినిమాని ఎవరూ చూడలేకపోయారు. ఈ చిత్రం కేవలం ఓటీటీ రిలీజ్ కోసమే రూపొందించినా మరి ఇంత ఘోరంగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: