బాలయ్య- బోయపాటి కాంబినేషన్ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి. అయితే మూడవ చిత్రం రూపొందుతున్న కారణంగా మళ్ళీ వాటి మాదిరి హిట్ కొడతారని అశిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా బాలయ్య సినిమాల్లో కొత్తదనం ఉండట్లేదన్న వార్తలు వినిపించాయి. కేవలం అభిమానుల కోసమే బాలయ్య సినిమా అన్నట్లుగా తయారయ్యిందని విమర్శలు వచ్చాయి.

 

ఈ నేపథ్యంలో రూలర్ సినిమా చూసిన తర్వాత బాలయ్య అభిమానులు కూడా కొత్తదనం కోరుకుంటున్నారు. ఈ మేరకు బాలయ్య వరకూ తమ సందేశాన్ని చేరవేసారట. అయితే అభిమానుల రిక్వెస్ట్ ని చాలా సీరియస్ గా తీసుకున్న బాలయ్య, బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో విభిన్న అంశాలు ఉండేలా చూసుకుంటున్నాడట. అందుకే ఈ సినిమాలో అఘోరాగా కనిపించే పాత్ర ఒప్పుకున్నాడని అంటున్నారు.

IHG'Lamb**i Kodaka,' Roars <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=BOYAPATI SRINU' target='_blank' title='boyapati-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>boyapati</a> Mark Balayya!

అయితే ఇంకా టైటిల్ నిర్ణయింపబడని ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా ఎవరు నటించనున్నారనేది సస్పెన్స్ గా మారింది. ఈ మేరకు బోయపాటి, ఇప్పటికే చాలా మంది హీరోయిన్లని అనుకున్నప్పటికీ ఫైనల్ గా ఒక నిర్ణయానికి వచ్చాడట. బాలయ్య సరసన కొత్త అమ్మాయిని తీసుకోవడానికే మొగ్గుచూపుతున్నాడని టాక్ వినబడుతుంది. బోయపాటి ఈ విషయంలో నిర్ణయం తీసేసుకున్నాడట.

IHG's Birthday teaser '#BB3 First Roar'

దాంతో అమలాపాల్ హీరోయిన్ గా నటిస్తుందని వచ్చిన వార్తలకి తెరపడినట్లే. మరి ఆ కొత్త ఆ కొత్త హీరోయిన్ ఎవరనేది మరికొద్ది రోజుల్లే ప్రకటిస్తారట. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి సూపర్ మాన్ అనే టైటిల్ ని అనుకుంటున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: