సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం బాలీవుడ్ ని దిగ్భ్రాంతికి గురి చేసింది. సక్సెస్ ఫుల్ హీరో, ఇంకా ఎంతో భవిష్తత్తు కలిగిన హీరో హఠాత్తుగా ఇలా ఆర్మహత్య చేసుకోవడం అందరినీ కలిచివేసింది. డిప్రెషన్ కారణంగా సుశాంత్ తన జీవితాన్ని అర్థాంతరంగా ముగించాడని అన్నారు. అయితే ఆ డిప్రెషన్ బాలీవుడ్ లో ఉన్న నెపోటిజం, బంధుప్రీతి వల్ల తన అవకాశాలు పోయాయన్న కారణంగా వచ్చిందన్న వాళ్ళు ఉన్నారు.

 

ప్రస్తుతానికి పోలీసులు సుశాంత్ మరణంపై ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నారు. అయితే కై పోచే, ఎమ్ ఎస్ ధోనీ, చిచోరే వంటి అద్భుతమైన చిత్రాల్లో హీరోగా చేసిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరి చిత్ర దిల్ బేచరా ఓటీటీలో రిలీజ్ అవుతుంది. కరోనా మహమ్మారి కారణంగా థియేటర్లు మూతబడిపోవడంతో నిర్మాతలు తమ సినిమాలని ఓటీటీ వేదికగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దిల్ బేచరా నిర్మాతలు కూడా సుశాంత్ చివరి చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయాలనే చూస్తున్నారు.

 

తాజగా డిస్నీ హాట్ స్టార్ అనౌన్ చేసిన ఏడు సినిమాల్లో దిల్ బేచరా కూడా ఒకటి. డిస్నీ హాట్ స్టార్ బాలీవుడ్ సినిమాలైన ఏడు చిత్రాలని కొనుక్కున్న సంగతి తెలిసిందే. అయితే సుశాంత్ అభిమానులు దిల్ బేచరా చిత్రాన్ని థియేటర్ లో రిలీజ్ చేయాలని కోరారు. సుశాంత్ కి ఘననివాళి థియేటర్ లో ఇస్తామని కోరారు. కానీ చిత్ర  నిర్మాతలు ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. అయితే హాట్ స్టార్ లో ఈ సినిమాని ఫ్రీగా ఉంచుతున్నారు. 

 

సాధారణంగా కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలకి ప్రీమియమ్ అకౌంట్ ఉంటేనె చూసే విధంగా వీలు కల్పిస్తారు. కానీ సుశాంత్ దిల్ బేచరా సినిమాకి మాత్రం అలా కాకుండా ప్రీమియం అకౌంట్ లేకపోయినా చూసేలా వెసులుబాటు కల్పించారు.  సుశాంత్ చిత్రాన్ని అందరూ చూడాలన్న ఉద్దేశ్యంతోనే ఈ విధంగా ఫ్రీగా ఉంచారట. ఈ నెల 24న దిల్ బేచరా హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: