ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా  వైరస్ ప్రభావం ఉన్న విషయం తెలిసిందే. దీంతో విద్యాసంస్థలు క్రీడలు సినిమాలు  ఉద్యోగాలు కంపెనీలు... ఇలా ప్రతి ఒక్కరూ ఇంటిపట్టునే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఎప్పుడు బిజీ బిజీ లైఫ్ ని గడిపే వాళ్ళందరూ ప్రస్తుతం ఇంటిపట్టునే కఫ్యామిలీ  హాయిగా గడుపుతున్నారు. అయితే ఈ లాక్ డౌన్  సమయంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా సమయాన్ని గడిపి  వాటిని అభిమానులతో పంచుకుని  నెటిజన్లకు అలరిస్తూనే ఉన్నారు. అయితే ఇలాంటి సమయంలో కొంతమంది తెగ ఫేమస్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వారిలో ఒకరు ఆస్ట్రేలియా డేర్ అండ్ డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్. ఈ లాక్ డౌన్  సమయం డేవిడ్ వార్నర్ కి బాగా కలిసి వచ్చింది అని చెప్పాలి.



మొన్నటి వరకు క్రికెట్ లో ఫేమస్ అయిన డేవిడ్ వార్నర్ ఈ క్వారంటైన్ సమయంలో సోషల్ మీడియాలో సూపర్ స్టార్ గా మారిపోయాడు, సోషల్ మీడియాలో తనదైన డాన్స్ పర్ఫార్మెన్స్ లతో ఇరగదీశాడు డేవిడ్ వార్నర్. క్వారంటైన్  సమయంలో కూడా ఎక్కడ ఎవరూ బోర్ గా ఫీల్ కాకుండా ఉండేందుకు తనదైన ఎంటర్టైన్మెంట్తో ఫుల్ ఎంజాయ్ మెంట్ పంచాడు అనే చెప్పాలి. ఈ క్వారంటైన్ సమయం మొత్తం డేవిడ్ వార్నర్ హాట్ టాపిక్ గా మారిపోయాడు. టిక్ టాక్ లో అకౌంట్ ఓపెన్ చేసి  ఎప్పుడు ఏదో పాట పై డాన్స్ పర్ఫార్మెన్స్ లు చేస్తూ ఎంతో  క్రేజ్ సంపాదించాడు

 ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయిపోయాడు డేవిడ్ వార్నర్. డేవిడ్ వార్నర్ తెలుగు హీరోల సినిమాల్లో నుంచి మంచి హిట్ సాంగ్స్ తీసుకుని వాటిపై తన కుటుంబంతో సహా స్టెప్పులు వేసి తెలుగు ప్రేక్షకులందరినీ మరింతగా ఆకర్షించాడు. తెలుగు ప్రేక్షకుల మదిలో ఇప్పటికే సన్రైజర్స్ టీమ్ లో ఆడి సుస్థిర స్థానం సంపాదించుకున్న డేవిడ్ వార్నర్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వరల్డ్ వైడ్ స్టార్ అయినప్పటికీ ఎక్కువగా తెలుగు హీరోలకు చెందిన సినిమాల పాటలు సెలెక్ట్ చేసుకుని దానిపై డాన్స్ పర్ఫార్మెన్స్ లు చేసి క్వారంటైన్ వైరల్ స్టార్ గా మారాడు  డేవిడ్ వార్నర్.


Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: