మొన్నటి వరకు క్రికెట్ లో ఫేమస్ అయిన డేవిడ్ వార్నర్ ఈ క్వారంటైన్ సమయంలో సోషల్ మీడియాలో సూపర్ స్టార్ గా మారిపోయాడు, సోషల్ మీడియాలో తనదైన డాన్స్ పర్ఫార్మెన్స్ లతో ఇరగదీశాడు డేవిడ్ వార్నర్. క్వారంటైన్ సమయంలో కూడా ఎక్కడ ఎవరూ బోర్ గా ఫీల్ కాకుండా ఉండేందుకు తనదైన ఎంటర్టైన్మెంట్తో ఫుల్ ఎంజాయ్ మెంట్ పంచాడు అనే చెప్పాలి. ఈ క్వారంటైన్ సమయం మొత్తం డేవిడ్ వార్నర్ హాట్ టాపిక్ గా మారిపోయాడు. టిక్ టాక్ లో అకౌంట్ ఓపెన్ చేసి ఎప్పుడు ఏదో పాట పై డాన్స్ పర్ఫార్మెన్స్ లు చేస్తూ ఎంతో క్రేజ్ సంపాదించాడు
ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయిపోయాడు డేవిడ్ వార్నర్. డేవిడ్ వార్నర్ తెలుగు హీరోల సినిమాల్లో నుంచి మంచి హిట్ సాంగ్స్ తీసుకుని వాటిపై తన కుటుంబంతో సహా స్టెప్పులు వేసి తెలుగు ప్రేక్షకులందరినీ మరింతగా ఆకర్షించాడు. తెలుగు ప్రేక్షకుల మదిలో ఇప్పటికే సన్రైజర్స్ టీమ్ లో ఆడి సుస్థిర స్థానం సంపాదించుకున్న డేవిడ్ వార్నర్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వరల్డ్ వైడ్ స్టార్ అయినప్పటికీ ఎక్కువగా తెలుగు హీరోలకు చెందిన సినిమాల పాటలు సెలెక్ట్ చేసుకుని దానిపై డాన్స్ పర్ఫార్మెన్స్ లు చేసి క్వారంటైన్ వైరల్ స్టార్ గా మారాడు డేవిడ్ వార్నర్.
Powered by Froala Editor