ఇప్పుడు లాక్ డౌన్ లో చాలా వరకు కూడా సినిమాలు అన్నీ కూడా వాయిదా పడుతూనే ఉన్నాయి. జనాలు కూడా లాక్ డౌన్ లో సినిమాల గురించి ఏ వార్త వచ్చినా సరే ఆసక్తిగా చదవడమే కాకుండా వాటి గురించి సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగా నే మాట్లాడుకోవడం మనం ఈ మధ్య కాలం లో చూస్తూ వస్తున్నాం. ఇక అది అలా ఉంటే పెళ్లి అనే వార్త టాలీవుడ్ లో బాగా హైలెట్ అవుతుంది. రానా పెళ్లి సహా కొన్ని వార్తలు టాలీవుడ్ లో బాగానే వైరల్ అవుతూనే ఉన్నాయి. నిహారికా పెళ్లి గురించి టాలీవుడ్ లో చాలా వరకు జనాలు మాట్లాడుతున్నారు. 

 

ఆమె పోస్ట్ చేస్తున్న ఫోటోలు వాటికి సోషల్ మీడియాలో వస్తున్న స్పందన వంటివి కాస్త వైరల్ అవుతున్నాయి. ఆమె ఎప్పుడు పెళ్లి గురించి ఏ వార్త చెప్తుందా అంటూ జనాలు ఆసక్తికరంగా చూస్తున్నారు. పెళ్లి కొడుకు ఎవరూ కాబోయే మెగా అల్లుడు ఎవరూ అంటూ జనాలు బాగానే ఆసక్తిగా వార్తలు చదివిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో ఈ పెళ్లి అయ్యే అవరకు కూడా వదిలే అవకాశం లేదు జనాలు. ఈ పెళ్లి కి మెగా ఫ్యామిలీ అప్పుడే ఏర్పాట్లు కూడా చేస్తుంది అంటూ కథనాలు సోషల్ మీడియాలో బాగానే వస్తున్నాయి. 

 

అబ్బాయి కోసం భారీగా కట్నం ఇస్తున్నారు అని పెళ్లి ఖర్చు అంతా కూడా వరుణ్ తేజ్ పెట్టుకునే అవకాశం ఉంది అంటూ సోషల్ మీడియాలో జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఈ పెళ్లి వార్త మాత్రం టాలీవుడ్ లో ఇప్పుడు ఫుల్ జోష్ ఇస్తుంది అనే మాట వాస్తవం. మరి ఆమె పెళ్లి ఎప్పుడు చేసుకునే అవకాశం ఉంది ఏంటీ అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: