టాలీవుడ్ లో త్రివిక్రమ్ కి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఆయన సినిమాలు అనగానే అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు సినిమా వస్తుంది ఏంటీ అంటూ చాలా వరకు కూడా ఫాన్స్ లో ఒక రేంజ్ లో క్రేజ్ అనేది ఉంటుంది. ఏ హీరో తో సినిమా చేసినా సరే అదే రేంజ్ లో క్రేజ్ ఆయన సినిమాలకు ఉంటుంది అనే సంగతి అందరికి తెలుసు. ఇప్పుడు కమర్షియల్ సినిమాలను ఆయన వరుసగా చేస్తున్నాడు. దాదాపు అందరు స్టార్ హీరోలతో ఆయన సినిమాలు స్లో గా వస్తున్నాయి. కాస్త గ్యాప్ తీఉకున్నా సరే చాలా వరకు జాగ్రత్తగానే చేస్తున్నాడు. 

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్ లో ఆయనకు మెగా ఫ్యామిలీ నుంచి ఫుల్ డిమాండ్ అనేది వచ్చింది అనే చెప్పాలి. మెగా ఫ్యామిలీ హీరోలు చాలా వరకు ఆయనతో సినిమాలు చేయడానికి చాలా వరకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి గానూ చిరంజీవి కూడా ఆసక్తి చూపిస్తున్నారు అని  టాక్ మరి. అది నిజమా కాదా అనేది తెలియదు గాని ఎన్టీఆర్ తో సినిమా లేట్ అయ్యే అవకాశం ఉన్న నేపధ్యంలో ఇప్పుడు త్రివిక్రమ్ ఒక సినిమాను చిరంజీవి తో చేసే అవకాశం ఉంది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి మరి. 

 

టాలీవుడ్ లో చాలా వరకు కూడా ఇప్పుడు ఈ వార్త హాట్ టాపిక్ గా మైరంది.  ఇక రామ్ చరణ్ కూడా త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నాడు అని అంటున్నారు. మరి అది నిజమా కాదా అనేది తెలియదు. ఇప్పుడు దీనికి సంబంధించి చర్చలు అయితే నడుస్తున్నాయి. మరి ఎవరి తో సినిమా చేస్తారు ఏంటీ అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: