కొరటాల శివకు ఈ మధ్య కాస్త డిమాండ్ అనేది మెగా ఫ్యామిలీ నుంచి బాగానే పెరిగింది అని చెప్పవచ్చు. ఆయన సినిమాల కోసం ఫాన్స్ ఒక రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. స్టార్ హీరోలతో ఆయన చాలా వరకు మంచి సినిమాలు చేస్తూ కాస్త లేట్ అయినా  పర్వాలేదు గాని డిమాండ్ ఉండే విధంగా సినిమాలను చేస్తూ ముందుకు వెళ్తున్నాడు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఇక అది అలా ఉంటే ఇప్పుడు కొరటాల గురించి ఒక వార్త టాలీవుడ్ లో సంచలనంగా మారింది. ఆయన రజనీ కాంత్ తో ఒక ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. 

 

తమిళనాడు లో ఎన్నికలకు ముందు కమర్షియల్ కోణం ఉండే విధంగా కమల్ హాసన్ రజనీ కాంత్ కలిసి ఒక సినిమాను చెయ్యాలి అని అది రాజకీయ కోణం లో ఉండాలి అని ప్లాన్ చేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే ఈ విధంగా కొరటాల శివ తో రజనీ ప్లాన్ చేసారు అని టాలీవుడ్ లో టాక్ మరి. నిజమా కాదా అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇప్పటికే కథ కూడా రెడీ చెయ్యాలి అని రజని నుంచి ఫోన్ కూడా కొరటాల కు వచ్చింది అని టాలీవుడ్ లో అంటున్నారు జనాలు. 

 

దీనిపై త్వరలోనే కొరటాల వర్క్ కూడా మొదలు పెట్టే అవకాశం ఉంది అని అయితే ఆచార్య సినిమా కారణంగా ఈ ప్రాజెక్ట్ కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తుంది. వచ్చే ఏడాది వేసవి తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. మరి నిజమా కాదా అనేది చూడాలి అంటే కచ్చితంగా కొన్ని రోజులు ఆగాల్సిందే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: