దివంగత నటుడు, బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గత నెల 14న తన అపార్ట్మెంట్ లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక సుశాంత్ మృతిపై ముంబై పోలీసుల విచారణ కొనసాగుతూనే వుంది అందులో భాగంగా 30మందిని విచారించిన పోలీసులు నిన్న ప్రముఖ దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీని విచారించారు. ఈసందర్భంగా భన్సాలీకి పోలీసులు సుమారు 20ప్రశ్నలు వేశారని సమాచారం.  గతంలో ఆయన తెరకెక్కించిన రామ్ లీలా ,బాజీరావ్ మస్తానీ సినిమాల్లో ముందుగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను హీరోగా అనుకున్నారని కానీ భన్సాలీ,సుశాంత్ కు ఆ ఛాన్స్ లు దక్కకుండా చేశాడని.. సుశాంత్ డిప్రెషన్ లోకి వెళ్ళడానికి ఇదికూడా ఓ కారణంఅంటూ భన్సాలీ పై అభియోగాలు వచ్చాయి.
 
దీనిపై కూడా పోలీసులు ,భన్సాలీని ప్రశ్నించగా అలాంటిదేమి లేదు నేను అతనికి అవకాశాలు రాకుండా చేశాననడంలో నిజం లేదు. సుశాంత్ తో చివరి సారిగా 2016లో మాట్లాడాను అంతే అప్పటినుండి అతన్ని కలవలేదు, అతని గురించి కూడా నాకేమి తెలియదని భన్సాలీ చెప్పినట్లు సమాచారం. ఇక ఈకేసులో మరికొంత మందిని విచారించే అవకాశాలు వున్నాయి. 
 
ఇదిలావుంటే సుశాంత్ నటించిన చివరి చిత్రం దిల్ బేచార యొక్క ట్రైలర్ నిన్న విడుదలై యూట్యూబ్ లో సరికొత్త రికార్డు సృష్టించింది. 24గంటల్లోపే ఈట్రైలర్ 5మిలియన్ల లైకులను రాబట్టి ప్రపచంలోనే అత్యధిక లైకులను రాబట్టిన తొలి ట్రైలర్ గా ఆల్ టైం రికార్డు సృష్టించింది. హాలీవుడ్ మూవీ ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈచిత్రం ఈనెల 24న ప్రముఖ ఓటిటి డిస్నీ+హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. కేవలం వీఐపీ మెంబర్స్ కు మాత్రమే కాకుండా అందరికి ఫ్రీగా ఈసినిమాను చూసే అవకాశం కలిపించింది హాట్ స్టార్. 

మరింత సమాచారం తెలుసుకోండి: