తెలుగు సినీ ప్రేక్షకులకు ఆర్ట్ ఫిలింస్ ఎక్కవు. మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ గా వచ్చినవి మంచి సినిమాలుగా గుర్తింపు తెచ్చుకున్న కమర్షియల్ గా క్లిక్ అవలేదు. ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. వీటిలో ప్రముఖంగా చెప్పుకునే సినిమాల్లో ‘సిందూరం’ ఒకటి. క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా మంచి సినిమాగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. కానీ.. ప్రేక్షకాదరణ దక్కలేదు. ఆ సినిమా విడుదలై జూలై 6వ తేదీకి 23 ఏళ్లు పూర్తయ్యాయి. నక్సలిజం ఇతివృత్తంతో తెరకెక్కిన ఆ సినిమా 1997లో విడుదలైంది.

IHG

 

‘నక్సలిజం ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఈ సినిమా అక్కడ ఎండ్ అవుతుంది’ అని కృష్ణవంశీ ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తనలోని సృజనకు నిదర్శనంగా తెరకెక్కిన ఈ సినిమాపై అప్పట్లో ఎటువంటి వివాదాలు చెలరేగకపోవడం విశేషం. నక్సలిజానికి ప్రభావితయ్యే అంశాలను.. నక్సలిజం ఎందుకు పోరాడుతోంది.. ఎందుకు తీవ్రమవుతుంది.. సిస్టంలోని లోపాలు.. పోలీస్ వ్యవస్థ.. ఇలా ప్రతీ అంశాన్ని సవివరంగా తెరకెక్కించాడు కృష్ణవంశీ. దీంతో ఈ సినిమా ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసింది. ఓ సినిమా ప్రేక్షకుల్ని ఆలోచింపజేసిందంటే అది నైతిక విజయం సాధించినట్టే. సిందూరం ద్వారా కృష్ణవంశీ సాధించింది ఇదే.

IHG

 

అందమైన ఊరు, ప్రజలు నిశ్శబ్దంలోకి వెళ్లిపోవడం ప్రేక్షకుల మనసుల్ని తాకుతుంది. రవితేజలోని నటుడ్ని వెలికి తీసింది ఈ సినిమా. బ్రహ్మాజీని హీరోని చేసింది. భానుచందర్ మంచి పాత్ర చేశారు.  సంఘవి పాత్రలో సరదాగా సాగిపోతుంది. ఆంధ్రా టాకీస్ బ్యానర్ పై కృష్ణవంశీ స్వీయ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. సిరివెన్నెల రాసిన ‘అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా..’ పాట ఆలోచింపజేస్తుంది. ‘సిందూరం’ ఉత్తమ ద్వితీయ చిత్రంగా నంది అవార్డు, జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డులు వచ్చాయి. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా ప్రదర్శించారు

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: