టాలీవుడ్ లో నానీ సినిమా వస్తుంది అంటే చాలు ఒక వర్గం ఫాన్స్ కి ఒక రేంజ్ లో పండగ అనే విషయం అందరికి తెలిసిందే. అతని సినిమాలకు ముందు నుంచి కూడా ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది అనే మాట ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతని సినిమాలు అనగానే అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా చాలా వరకు ఎదురు చూసే అవసరం అయితే ఉంటుంది. ఇక మంచి వినోద౦ ఉండటమే కాకుండా ఆమంచి లవ్ స్టోరీ కూడా ఆయన సినిమాల్లో ఉండటం తో ఫాన్స్ కూడా చాలా వరకు సినిమాలకు ప్రాధాన్యత బాగానే ఇస్తూ ఉంటారు. 

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు నానీ మళ్ళీ దర్శకుడు అయ్యే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది. మరి అది ఎంత వరకు నిజం అనేది ఇంకా స్పష్టత లేదు గాని ఆయన  దర్శకుడు కావడానికి గానూ చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నారు అని సమాచారం. ఏమీ లేదు ఆయన నిఖిల్ తో లేదా శర్వానంద్ తో ఒక సినిమాను దర్శకుడిగా చేసే అవకాశం ఉంది అనే వార్తలు టాలీవుడ్ వర్గాల్లో వస్తున్నాయి. గతంలో నానీ బాపు దగ్గర సహాయ దర్శకుడిగా  పని చేసిన సంగతి తెలిసిందే. 

 

ఇక లాక్ డౌన్ లో నానీ ఒక కథ రాసాడు అని దానికి సంబంధించి సినిమా చేయడానికి గానూ అతను ఎదురు చూస్తున్నాడు అని టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది. మరి అది నిజమా కాదా అనేది తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక నానీ ఇప్పుడు వీ అనే సినిమాలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని టాక్ మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: