రానా పెళ్లి వార్త... టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో సంచలనం సృష్టించిన వార్తల్లో ఇది కూడా ఒకటి. ఈ వార్త రాగానే చాలా మంది షాక్ అయ్యారు. అసలు రానా ప్రకటించిన విధానమే ఒక రేంజ్ లో పాపులర్ అయింది. ఆ తర్వాత  తర్వాత అది సోషల్ మీడియాలో ఒక సంచలనం అనే విషయం అందరికి తెలిసిందే. ఇక ఆయనకు కాబోయే భార్య గురించి సోషల్ మీడియాలో పెద్ద ప్రచారమే జరుగుతూ వస్తుంది. ఇక ఆమె గురించి జనాలు చాలా బాగా చదివారు కూడా. ఆమె కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని అన్నారు. 

 

ఆమెకు గతంలోనే రానా తో మంచి పరిచయం ఉందని అందుకే రానా ఆమెనే  పెళ్లి చేసుకోవాలి అని భావించాడు అని అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే రానా సినిమాల విషయంలో ఇప్పుడు చాలానే కథనాలు వస్తున్నాయి. ఈ తరుణంలోనే పెళ్లిని రానా వాయిదా వేసే అవకాశం ఉంది అని  కూడా  అంటున్నారు. రానా ఇప్పుడు పెళ్లిని చేసుకోవాలి అని భావించినా సరే హైదరాబాద్ లో కరోనా తీవ్రత చాలా అధికంగా ఉంది. అక్కడ కరోనా తీవ్రత తగ్గే అవకాశాలు దాదాపుగా లేవు అనే విషయం అర్ధమవుతుంది. 

 

నిన్న కూడా భారీగానే కరోనా కేసులు వచ్చాయి హైదరాబాద్ లో. అందుకే అతను పెళ్లిని వాయిదా వేసి సినిమాలు చెయ్యాలి అని చూస్తున్నాడు అని అంటున్నారు. పెళ్లి చేసుకునే అవకాశం లేదు అని చిన్న సినిమా ఒకటి ఉంది అని దాన్ని చేసే ఆలోచనలో రానా ఉన్నాడు అని అంటున్నారు. మరి నిజమా కాదా అనేది తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. రానా ఇప్పుడు పెళ్లి ఏర్పాట్లు కూడా బాగానే చేస్తున్నాడు. మరి  ఎం జరుగుతుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: