టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ లేదా నందమూరి ఫ్యామిలీ గురించి ఏ వార్త వచ్చినా సరే అది కచ్చితంగా హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ఏదోక కథనం సోషల్ మీడియాలో వస్తూనే ఉంటుంది. సోషల్ మీడియాలో జనాలు కూడా ఒక రేంజ్ లో సదరు వార్త కోసం కాస్త ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ తన అన్న తో ఒక సినిమా ప్లాన్ చేసాడు అని అంటున్నారు. అవును తన అన్న తో కలిసి అతను ఒక సినిమా చేసే అవకాశం ఉంది అనే దాని మీద చాలానే కథనాలు వస్తున్నాయి మరి. అతను ఇటీవల తన అన్న పుట్టిన రోజు సందర్భంగా దీని గురించి చర్చించారు అని టాక్.
మరి నిజమా కాదా అనేది తెలియదు గాని ఈ సినిమాను అతను తీసుకు రావడం దాదాపుగా ఖాయమని అంటున్నారు. కథ గురించి చాలానే చర్చలు జరుగుతున్నాయి అని కథను రాజమౌళి తండ్రి ని అడిగారు అని సమాచారం. ఆయన కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చారు అని టాక్ మరి. నిజమా కాదా అనేది తెలియదు గాని దీనిపై చాలానే చర్చలు అయితే టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి ఒక ప్రముఖ దర్శకుడు కూడా ముందుకు వచ్చారు అని సమాచారం.
మరి అది నిజమా కాదా అనేది తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇప్పుడు ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాతే అతను ఏ సినిమా అయినా సరే చేసే అవకాశం ఉంటుంది. మరి ఈ సినిమా ఎప్పుడు పూర్తి చేసే అవకాశం ఉంది అనేది చూడాలి. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో ఒక సినిమా చేస్తాడు ఎన్టీఆర్.