టాలీవుడ్ జనాలు ఇప్పుడు సినిమాల గురించి ఏ వార్త వచ్చినా సరే అసలు మిస్ అవ్వడం లేదు. ఏ వార్త వచ్చినా సరే దాన్ని ఒకటికి పది సార్లు సోషల్ మీడియా లో చర్చించే పరిస్థితి అయితే ఉంది అనే మాట వాస్తవం. ఇప్పుడు మన తెలుగు లో ఎక్కువగా ఆర్ఆర్ఆర్ సినిమా గురించి వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్స్ ని మార్చే అవాకాశం ఉంది అనే దాని మీద చాలానే చర్చలు అయతే టాలీవుడ్ లో వర్గాల్లో జరుగుతున్నాయి. హీరోయిన్ లు ఇద్దరూ కూడా ఒకరు అమెరికాలో ఒకరు ముంబై లో ఉండటం తో ఏమీ చేయలేని పరిస్థితి లో ఉన్నారు అని అంటున్నారు. 

 

అందుకే ఇప్పుడు రాజమౌళి వారిని మార్చే ఆలోచన చేసారు అనే దాని మీద వార్తలు వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో ఇప్పుడు ఈ వార్త కాస్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది అనే చెప్పాలి. జక్కన్న ఆలోచన నిజమా కాదా అనేది తెలియదు గాని జనాలు మాత్రం దాని గురించి కాస్త ఎక్కువగానే వార్తలు రాయడమే కాకుండా వాటిని ఎక్కువగా ప్రచారం చేయడం వంటివి చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్ లో మరో వార్త ఈ సినిమా గురించి ప్రచారం జరుగుతుంది. 

 

ఈ సినిమాను  తమిళం లో ఆలస్యంగా విడుదల చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి నిజమా కాదా అనేది తెలియదు గాని తమిళం లో ఈ సినిమా లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని డబ్బింగ్ తో పాటుగా కొన్ని కొన్ని సన్నివేశాలు  లేట్ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి ఏ సన్నివేశాలు తమిళ ప్రేక్షకుల కోసం పెట్టారో తెలియదు గాని లేట్ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: