దగ్గుబాటి వారి వంశాంకురం దగ్గుబాటి రానా ఆగస్టు 8వ తేదీన ఓ ఇంటి వాడు అవుతోన్న సంగతి తెలిసిందే. ఓ వైపు కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కంటిన్యూ అవుతున్నా కూడా రానా మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. నితిన్ లాంటి హీరోలు ఇప్పటికే రెండు, మూడు సార్లు పెళ్లి వాయిదా వేసుకున్నారు. నిఖిల్ సైతం ఒకసారి పెళ్లి వాయిదా వేసుకున్నా ఇప్పుడు సింపుల్ గా పెళ్లి చేసేసుకున్నాడు. ఇక రానా మాత్రం ఆగస్టు 8న పెళ్లికి రెడీ అవుతున్నాడు.
అటు దగ్గుబాటి ఫ్యామిలీ తో పాటు ఇటు మిహీకా బజాజ్ ల ఫ్యామిలీలు పెళ్లి పనుల్లో బిజీ బిజీగా ఉన్నాయి. రానా కూడా ఈ పెళ్లికి ఎవరెవరిని పిలవాలి ? కరోనా ఉన్నందున తనకు బాగా సన్నిహితులు అయిన వారిని మాత్రమే పిలవాలని అనుకుంటున్నాడట. చాలా పరిమితమైన బంధువుల సమక్షంలోనే ఈ పెళ్లి జరుగుతుందని అంటున్నారు. ఇదిలా ఉంటే రానాకు కాబోయే భార్య మిహీకా బజాజ్ ఓ షాకింగ్ పని చేసి అందరిని ఆశ్చర్య పరిచింది. ఆమె ఇన్ స్ట్రా గ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.
మిహీకా ఇన్ స్టాగ్రామ్ లో తాజాగా తన పెళ్లి జూటిస్ ఫోటోని పంచుకుంది. ఇక రానా చక్కగా డిజైన్ చేసిన ఎంబ్రాయిడరీ ఫిజ్జీ గోబ్లెట్ జూటిస్ ధరించనున్నారు. ఈ వివాహం హైదరాబాద్ లోని తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ లో జరుగుతుంది. ఇక టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లలో ఒకడిగా ఉన్న రానా కూడా పెళ్లి పీఠలు ఎక్కేస్తుండడంతో ఇప్పుడు అందరి దృష్టి ప్రభాస్ మీద మాత్రమే ఉంది.