తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న వెర్సటైల్ ఆర్టిస్టుల్లో నేచురల్ స్టార్ నాని ఒకరు. తాను ఎంపిక చేసుకునే సబ్జెక్టులతోనే తనలోని స్పెషాలిటీని నిరూపించుకుంటాడు. పరిశ్రమలో 12ఏళ్ల లాంగ్ కెరీర్లో తాను చేసిన సినిమాలే ఈ విషయాన్ని ధ్రువీకరిస్తాయి. నాని చేసిన అద్భుతమైన సినిమాల్లో మొదటి వరుసలో ఉండే సినిమా ‘నిన్ను కోరి’. దర్శకుడు శివ నిర్వాణకు ఇదే తొలి సినిమా. దర్శకుడిగా శివ.. హీరోగా నానీ.. ఈ సినిమాతో మ్యాజిక్ చేశారు. ఈ సినిమా విడుదలై నేటికి 3ఏళ్లు పూర్తయ్యాయి.

IHG

 

సినిమా 2017 జూలై 7న విడుదలైంది. లవ్ సబ్జెక్ట్ తో పాటు.. ఎమోషన్స్ ఎక్కువగా ఉన్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం విశేషం. ఇందుకు దర్శకుడు తీసుకున్న కథలోని కొత్తదనమే కారణం. కథ ట్రాజెడిక్ కాకుండా సెమీ ట్రాజిక్ ఎండింగ్ ఇచ్చి.. ప్రేక్షకులకు ఆ ఫీలింగ్ కలుగకుండా చేయడంలో దర్శకుడు శివ నిర్వాణ బాగా సక్సెస్ అయ్యాడు. శివ కథ, కోన వెంకట్ స్క్రీన్ ప్లేల్లోని ఫ్రెష్ నెస్ ఆడియన్స్ ని మెప్పించింది. దీంతో సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఉమా పాత్రలో నాని, పల్లవిగా నివేధా థామస్, అరుణ్ పాత్రలో ఆది పినిశెట్టి తమ పాత్రలకు న్యాయం చేశారు.

IHG

 

గోపీ సుందర్ అందించిన సంగీతం సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. పాటలన్నీ హిట్టయ్యాయి. పాత్రలు తక్కువగా ఉన్నా కథను నడిపించడంలో శివ నిర్వాణ సక్సెస్ అయ్యాడు. నానిలోని సహజ నటనకు ఈ సినిమా ఓ మచ్చుతునక. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ సినిమా నిర్మించారు. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా దాదాపు 30కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలు తీసుకొచ్చింది. ఆ ఏడది హిట్టైన సినిమాల్లో ‘నిన్నుకోరి’ ప్రత్యేకంగా నిలిచిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: