టాలీవుడ్ లో ఇప్పుడు రాణాకు మంచి క్రేజ్ అనేది ఉంది. అతని సినిమాలు అనగానే ఫాన్స్ కూడా చాలా బాగా ఎదురు చూస్తున్నారు. అతని సినిమాల్లో ఉండే కథ సహా సినిమాల్లో ఉండే కొన్ని సన్నివేశాలు యువతకు చాలా బాగా నచ్చుతు ఉంటాయి. అతను కూడా వారికి బాగా దగ్గరయ్యే విధంగా వాటిని చూపించే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటాడు. ఇప్పుడు రానా మన తెలుగు తో పాటుగా ఇతర భాషల్లో కూడా వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు రానా ఒక భారీ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేసాడు అని సమాచారం. 

 

ఒక సినిమాను తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ తో కలిసి తెలుగు లో చెయ్యాలి అని దానిని పాన్ ఇండియా లెవెల్ లో తీసుకుని రావాలి అని ప్లాన్ చేస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. నిజమా కాదా అనే దాని మీద ఇంకా క్లారితి లేదు గాని దీనిపై మాత్రం చర్చలు బాగానే జరుగుతున్నాయి. అగ్ర హీరోల సినిమాలు అనగానే ఇప్పుడు ఎదురు చూసే ఫాన్స్ ఇక నుంచి విలక్షణ సినిమాల కోసం కూడా ఎదురు చూసే అవకాశం ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే రానా పల్స్ తెలుసుకుని సినిమాలను ప్లాన్ చేస్తూ ఉంటాడు. 

 

అందులో భాగంగానే అతను ఈ సినిమాను ప్లాన్ చేసాడు అని సమాచారం. మరి ఇది ఎప్పుడు వస్తుంది ఏంటీ అనేది చూడాలి. ఇక రానాసినిమా కోసం భారీగా పెట్టుబడి పెట్టే అవకాశాలు  కూడా ఉన్నాయి అని టాలీవుడ్ లో అంటున్నారు మరి. నిజమా కాదా అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే మరి. ఈ సినిమాకు ముందు పెళ్లి చేసుకుంటాడని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: