ఇప్పుడు మన స్టార్ హీరోలు అందరూ కూడా తమిళం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ సినిమాలు ఇప్పుడు జనాలకు బాగా నచ్చడం తో అక్కడ సినిమాలను ఇక్కడ చేయడానికి గానూ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అనే కథనాలు ఈ మధ్య కాలంలో బాగానే వస్తున్నాయి అని చెప్పాలి. స్టార్ హీరోలు చిన్న హీరోలు అందరూ కూడా ఇప్పుడు అక్కడి సినిమాలను ఇక్కడ తీసుకుని వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు మన స్టార్ హీరోలు చాలా వరకు కూడా జాగ్రత్తగా సినిమాలను లైన్ లో పెడుతున్నారు. 

 

ఇక నుంచి తమిళ మార్కెట్ ఉండాలి అని భావిస్తే కచ్చితంగా తమిళ హీరో ఉండాల్సిందే అని భావిస్తున్నారు. అలా అయితేనే సినిమాల్లో మార్కెట్ అనేది ఉంటుంది అనే నిర్ణయానికి వచ్చేశారు.  సినిమాను డబ్బింగ్ చెప్పి విడుదల చేయకుండా అక్కడి హీరోలను సినిమాల్లోకి తీసుకుని సినిమాలు చేస్తే కచ్చితంగా ఆమంచి స్పందన అనేది ఉంటుంది అనే నిర్ణయానికి వచ్చేశారు మన స్టార్ హీరోలు. అదే విషయాన్ని దర్శక నిర్మాతలకు కూడా చెప్తున్నారు. అందుకే అక్కడ మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ సేతుపతి ని తమ సినిమాల్లో ఉండే విధంగా మన స్టార్ హీరోలు ప్లాన్ చేస్తున్నారు. 

 

ఇటీవల విజయ్ తో ఒక సినిమాను మహేష్ కూడా చేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే అతని తో ఒక సినిమాను ప్లాన్ చేసారు. ఇక రానా కూడా అక్కడి సినిమాల్లో నటించే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లో కూడా తమిళ నటులు ఉన్న సంగతి తెలిసిందే. ఈ విధంగా ఇప్పుడు సినిమాలను ప్లాన్ చేస్తున్నారు. గతంలో మాదిరిగా డబ్బింగ్ చెప్పి విడుదల చేసే విధానం లో అసలు వెళ్ళడం లేదు మన హీరోలు.

మరింత సమాచారం తెలుసుకోండి: