అగ్ర హీరోల సినిమాల్లో దాదాపుగా కూడా ఇప్పుడు మనం కొన్ని కొన్ని కోణాలు బాగా చూస్తున్నాం. అందులో కమెడియన్ లేకుండా  కామెడి చేస్తూ వస్తున్నారు. ఈ కోణాలు మనం ఎక్కువగా చూస్తున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా కూడా ఇలాగే సినిమాలు చేస్తున్నారు స్టార్ హీరోలు అనే సంగతి స్పష్టంగా అర్ధమవుతుంది. మరి కమెడియన్ అనేది లేకుండా  గతంలో అసలు సినిమా వచ్చేది కాదు. కాని ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. అయితే ఇక నుంచి ప్రేక్షకుల ఆలోచన మారే అవకాశాలు ఉన్నాయి అని అంచనా వేస్తున్నారు. 

 

సినిమాల్లో కామెడి అనేది చాలా అవసర౦ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. అవును స్టార్ హీరోల సినిమాలు అయినా చిన్న హీరోల సినిమాలు అయినా సరే ఇప్పుడు జనాలు చాలా వరకు వినోదం కోరుకునే అవకాశం ఉంది. లాక్ డౌన్ లో చాలా వరకు ప్రజలు కష్టాల్లోనే ఉన్నారు అనే సంగతి తెలిసిందే. ఇప్పుడు వారికి మంచి ఓదార్పు అనేది సినిమా నుంచి వచ్చే అవకాశం ఉండాలి గాని సినిమా చూసి ఈలలు ఒకడు వేస్తే బాధ పడే అవకాశం ఉండకుండా చెయ్యాల్సి ఉంటుంది. సినిమా కథల విషయంలో ఒకటికి పది సార్లు ఆలోచన చేసి కామెడి ప్రధానంగా ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. 

 

అగ్ర హీరోల సినిమాలు ఎన్ని వచ్చినా సరే కామెడి సినిమా ఒకటి వస్తుంది అంటే జనాలు మనశ్శాంతి కోసం దానిని చూస్తూ ఉంటారు. కాబట్టి సినిమాలు చూసే సమయంలో కన్నీళ్లు రక్త పాతాలు ఇక అవసరం లేదు అని కాబట్టి సినిమా కథలను రాసే వారు తీసే హీరోలు దర్శకులు నిర్మాతలు ఇక నుంచి  కామెడి అనే కోణం కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవాలి అని  సూచనలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: